పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్ కి దిమ్మతిరిగిపోయే విధంగా షాక్ ఇచ్చింది.  రాష్ట్ర ప్రథమ పౌరుడు మరియు ప్రభుత్వ అధికారులు ముఖ్యమంత్రి మరియు మంత్రులు ఆయన మాటను గౌరవించాల్సిన క్రమంలో తాజాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ జగదీప్ ధన్‌కర్ కి అసెంబ్లీలోకి నో ఎంట్రీ బోర్డు మమత సర్కార్ పెట్టడంతో జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా ప్రస్తుతం సంచలనం సృష్టించింది. విషయంలోకి వెళితే ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో అసెంబ్లీలో కి వెళ్దామని గవర్నర్ నంబర్ వన్ గేటు గుండా వెళ్లాలనుకున్న క్రమంలో ఆ గేటుకు తాళం వేయడం తో తీవ్ర అవమానంగా భావించి వెంటనే అక్కడ నిరసనకు దిగారు. కావాలని రాజ్యాంగబద్ధంగా రాష్ట్రానికి నియమితులైన అధికారులపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు అని గవర్నర్ జగదీప్ ధన్‌కర్ తెలిపారు.

 

ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో తాను ఆమె అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని చారిత్రాత్మక కట్టడం అయిన అసెంబ్లీ ని చూడటానికి వచ్చాను అని అంతేకాకుండా అసెంబ్లీలో తన పుస్తకాలు ఉన్నాయి అని గవర్నర్ జగదీప్ ధన్‌కర్ తెలపడం జరిగింది. ఈ క్రమంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ మమతా బెనర్జీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని అవమాన పరిచారని స్పీకర్ మీటింగ్ అని పిలిచి, చివరి నిమిషంలో ఆ కార్యక్రమాన్ని రద్దు చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

 

మరోపక్క మమతా బెనర్జీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు రాష్ట్రానికి సంబంధించిన కొన్ని కీలకమైన పలు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉండగా ఆయన కావాలని ఆలస్యం చేస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి తొత్తులా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా జగదీప్ ధన్‌కర్ నీ నియమించింది ఎన్డీఏ సర్కారు కావడంతో ...తాజాగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి మరియు గవర్నర్ మధ్య జరుగుతున్న వివాదాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: