బుధవారం, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి  మెహబూబా ముఫ్తీ కుమార్తె  బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ  మంత్రివర్గం ఆమోదించిన పౌరసత్వ సవరణ బిల్లు తో , ఈ  దేశ  ముస్లిం సమాజానికి  చెందిన వారిపై వివక్ష చూపుతుందని సూచించింది.

 

 

కేంద్ర మంత్రివర్గం పౌరసత్వ సవరణ బిల్లు  క్లియర్ చేసిన కొన్ని గంటల తరువాత, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా  ఇక నుంచి భారతదేశం - ముస్లింలకు చెందిన  దేశం కాదు అనే సందేశం బిజెపి  ఈ బిల్లు ద్వారా ముస్లిం లకు ఇవ్వబోతుంది  అనే ఒక మెసెజ్ ట్వీట్ చేయబడింది.   పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆగస్టు 5,  ఆర్టికల్ 370 ను రద్దు చేసినప్పటి  నుండి నిర్బంధంలో ఉన్నందున,  ఆమె కుమార్తె సనా ఇల్టిజా జావేద్ తన సోషల్ మీడియా ఖాతాలను నిర్వహిస్తున్నారు.

 

 

 

బిజెపి ప్రభుత్వ  కేంద్ర మంత్రి వర్గం ప్రకారం,  ఈ చట్టం  పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి మైనారిటీలకు పౌరసత్వం పొందడం సులభతరం చేస్తుంది.  ఈ చట్టం అమలు తో బీజేపీ  ముస్లింల పట్ల వివక్ష చూపుతోందని హక్కుల సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.  ఏదేమైనా, కేంద్రం తన నిర్ణయాన్ని సమర్థించింది, చుట్టుపక్కల దేశాల నుండి "హింసించబడిన" మైనారిటీలకు సహాయం చేయడం తమ  విధిగా  పేర్కొంది.

 

 

 

 ప్రభుత్వం ముస్లింలను టార్గెట్ చేస్తుందని   మెహబూబా ముఫ్తీ లేదా ఆమె కుమార్తె ఆరోపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో  మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో  ఒక పోస్ట్‌లో, బిజెపికి 2014 లో చారిత్రాత్మక విజయం  లభించిందని, అయితే వారు తమ ముఖ్య వాగ్దానం అయినా  ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ (అందరితో కలిసి ఉండటం, అందరి  వృద్ధి) అనే నినాదంపై దృష్టి పెట్టలేదని ఆమె రాశారు. బీజేపీ ప్రభుత్వం  విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తుందని ఇది  ఒక దుష్ట వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుందని ఆమె ఆరోపించారు.

 

 

 

మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా మరియు అతని కుమారుడు ఒమర్ అబ్దుల్లా లను  ముందు జాగ్రత్త  చర్యగా బీజేపీ ప్రభుత్వం   నిర్బంధంలో ఉంచింది, ఇప్పటికి వారు విడుదలయ్యే తేదీ పై స్పష్టత లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: