భారతదేశంలో ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాలు హత్యలు ప్రపంచంలో అగ్ర దేశాలకు వణికించే విధంగా చేస్తున్నాయి. దిశ ఘటన ఇటీవల చోటుచేసుకోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న నాయకులు తమదైన శైలిలో స్పందించగా ఈ వార్త విన్న ప్రపంచ దేశాలు భారతదేశంపై తమ అభిప్రాయాలను మార్చుకుంటూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో యూరప్ కంట్రీ కి చెందిన ఆడవాళ్లను ఇస్లామిక్ దేశాలలో మరియు ఉగ్రవాదం ఎక్కువగా ఉండే దేశాలలో పంపించడానికి యూరప్ కంట్రీ అధికారులు ఆ దేశానికి వెళ్లి ఆడవాళ్లకు చాలా జాగ్రత్తలు చెప్పేవాళ్లు.

 

ముఖ్యంగా పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఎక్కువ ప్రభావితం చేసే ప్రాంతం మరియు ఉగ్రవాదం తో నలిగిపోయే దేశస్థుల మధ్య యూరప్ దేశాలకు చెందిన ఆడవాళ్లకు చాలా జాగ్రత్తలు మరియు ఆ దేశంలో యూరోప్ కంట్రీ కి చెందిన అధికారుల ఫోన్ నెంబర్లు ముందే పాస్ పోర్ట్ తో సహా ఇచ్చి పంపించే పరిస్థితులు అప్పట్లో ఉండేవి. అయితే తాజాగా ఇప్పుడు ఆ పరిస్థితి భారతదేశానికి వెళ్లే యూరప్ కంట్రీ మహిళలకు సదరు దేశ అధికారులు జాగ్రత్తలు చెబుతున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల అగ్రరాజ్యం అమెరికా మరియు బ్రిటన్ దేశాలు తమ దేశానికి చెందిన మహిళలు భారత్ కి వెళ్లే వారికి కొత్త ఆదేశాలు జారీ చేసినట్లు అంతర్జాతీయంగా వార్తలు వినబడుతున్నాయి.

 

దిశ ఘటన యావద్దేశం తో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో అమెరికా, బ్రిటన్ దేశాలు...తమ దేశం నుండి ఇండియాకి వెళ్లే మహిళలకు కొత్త ఆదేశాలు జారీ చేసినట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. ముఖ్యంగా వస్త్రధారణ మరియు ఇంకా అనేక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని...ఏకాంతమైన ప్రదేశాలలో ఉండకూడదని భారత్ కి వెళ్లే మహిళల ఇన్ఫర్మేషన్ ముందే ఇండియాలో ఉండే సదరు దేశస్థుల అధికారులకు ఇవ్వాలని అమెరికా బ్రిటన్ కొత్త ఆదేశాలు తాజాగా జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద దిశ ఘటన జరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభివృద్ధి చెందిన దేశాలకు ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న భారత దేశం పై భిన్నాభిప్రాయాలు నెలకొన్నట్లు తాజా పరిస్థితుల బట్టి తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: