బతుకుదెరువు కోసం అరేబియా మహా సముద్రంలో చేపలు పట్టే టందుకు వేటకు వెళ్లి చిక్కు కోవడం జరిగింది. దాదాపు 264 మంది జాలర్ల ఇరుక్కు పోయారు అని సమాచారం. వారిని కోస్ట్‌గార్డ్ సిబ్బంది కనుక్కొని రక్షించారు. డిసెంబరు 3న చేపల వేటకు వెళ్లారు.మత్స్యకారులు వెళ్లిన తర్వాత సముద్రము అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో కల్లోలం వల్ల జాలర్లు సముద్రములో చిక్కు కోవడం జరిగింది. తమిళనాడుకు చెందిన మత్స్యకారుల బృందము ఇచ్చిన సమాచారంతో ఇండియన్‌ కోస్టు గార్డు ఈ రంగంలోకి దిగింది. వారిని రక్షించడానికి కొన్ని మోటార్ బోట్లను ఏర్పాటు చేసుకొని,మోటారు బోట్ల సాయంతో వారి అందరిని సురక్షితంగా సముద్రతీరానికి చేర్చారు. 

 

మొత్తం 50 పడవల్లో మత్స్యకారులు అరేబియా సముద్రం లోకి వెళ్లారు.264 మంది మత్స్యకారులు పశ్చిమ గోవాకు 250 నాటికల్ మైల్స్ దూరంలోని అరేబియాలో చిక్కుకున్నట్టు సమాచారం రావడంతో వెంటనేకోస్ట్‌గార్డ్ సిబ్బంది స్పందించి మొత్తం ఏడు మోటారు బోట్లతో జాలర్లు చిక్కుకున్న ప్రదేశానికి  చేరుకున్నారు. వీరందరినీ ఇండియన్ మర్చెంట్ షిప్ నవ్‌ధేను పూర్ణ 86 మంది మత్స్యకారులను, జపాన్‌కు చెందిన ఎంవీ తోవ్డాలో 34 మంది తరలించారు.

 

 కోస్ట్‌గార్డ్స్ నుంచి వచ్చిన విన్నపంతో మారీటైమ్ రెస్క్యూ కో-ఆర్డినేషన్ సెంటర్ ఐదు భారీ పడవలను జాలర్లను రక్షించడానికి పంపిన ది. దీంతో మొత్తం 264 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం వారికి అందించవలసిన ప్రథమ చికిత్స నిర్వహించి ఆహారం కూడా అందజేశారు.వాతావరణము సహకరించకపోతే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది అని ఆరోగ్యం పరీక్షల నిర్వహణ అనంతరం వారిని వాళ్ల ప్రదేశాలకు (మాతృ దేశమునకు)పంపినట్టు అధికారులు సమాచారము వెల్లడించారు. అరేబియా సముద్రంలో అల్పపీడనం ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. అయినప్పటికీ  మత్స్యకారులు వాతావరణ శాఖ తెలియజేసిన సమాచారము ను నిర్లక్ష్యం చేసి సముద్రం లోకి వెళ్లారు.

 చేపల వేటకు వెళ్లరాదని తెలిపిన  పట్టించుకోకుండా వేటకు వెళ్లిన మత్స్యకారులు ప్రమాదంలో చిక్కుకున్నారు. డిసెంబరు 3 వరకు కేరళ, లక్షద్వీప్ ప్రభుత్వాలు చేపల వేటపై నిషేధం కూడా విధించాయి.


కాగా, ప్రమాద సమయంలో రెస్క్యూ ఆపరేషన్ల కోసం ఇండియన్ కోస్ట్‌గార్డ్ వద్ద సముద్ర ప్రహరీ, సమర్, సావిత్రీబాయ్ ఫూలే, అమల్, అపూర్వ నౌకలు సిద్ధంగా ఉంటాయి. వీటికి తోడు డోర్నియర్ యుద్ధ విమానాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎనిమిది నౌకలు, మూడు విమానాలు నిరంతరం తీర ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్నాయి. ఎన్ని  వాహనాలు గస్తీ పెట్టిన మత్స్యకారులు వినకుండా సముద్రం లోకి వెళ్లడం చాలా అపాయం. మళ్లీ వీళ్లను రక్షించడానికి ప్రభుత్వము ఎంతో రిస్క్ తీసుకోవాల్సిన అవసరం వస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: