షాద్ నగర్ సమీపంలో అత్యంత దారుణంగా లైంగికదాడి, హత్యకు గురైన దిశ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో నిందితులపై ఏమాత్రం కనికరించవద్దనీ.. ఇటువంటి మావన మృగాలు సభ్య సమాజంలో తిరగటానికి వీల్లేదని వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా కఠినాతి కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరైతే ఇటువంటి క్రూరుల్ని తాము చంపేస్తామని కూడా ఆగ్రహావేశాల్ని వెళ్లగ్రక్కుతున్నారు. ఈ క్ర‌మంలోనే హత్యకు గురైన దిశ కేసులో బాధిత కుటుంబసభ్యులకు సత్వర న్యాయం అందించేందుకు, నిందితులకు వేగంగా శిక్ష పడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటుచేసిన విష‌యం తెలిసిందే. 

 

అయితే వాస్త‌వానికి చాలా మిస్టరీ గా ఉన్న ఈ మర్డర్ కేస్ ను ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు అంతే త్వరగా దోషులను పట్టుకున్నారు. కానీ.. నిందితులను పట్టుకోవడంలో పోలీసులకు బాధితురాలి ఫోన్ కీలకంగా ఉపయోగపడింది. కాల్ లిస్టు ఆధారంగా ఆమె ఫోన్ నుంచి ఏ1 మహ్మద్‌కు ఫోన్ చేసినట్లు గుర్తించిన పోలీసులకు ఆ కిరాతకులను అరెస్టు చేయడం సులువైంది. ఇక ఈ ఫోన్ గురించి పోలీసులు అప్ప‌టి నుంచే వెతుకుతూనే ఉన్నారు. ఇక తాజాగా దిశ సెల్ ఫోన్ ను పోలీసులు గుర్తించారు. హత్యాచారం ఘటనకు అర కిలోమీటరు దూరంలో దిశ ఫోన్ ను దోషులు భూమిలో పాతిపెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. 

 

సెల్ ఫోన్ తో పాటు మరికొన్ని వస్తువుల్ని కూడా గుర్తించారు. ఇక ఈ ఫోన్ ద్వారా మ‌రింత స‌మాచారం తెలిసే అవ‌కాశం ఉందంటున్నారు. ఇక మరోవైపు వెంటనే నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కోర్టు దగ్గర నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. అయితే  కేసులో నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. 10 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని షాద్ నగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. షాద్ నగర్‌లో అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టిన ఈ కేసులో నిందితుల నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని అందులో తెలిపారు పోలీసులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: