కర్ణాటకలో ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల పైనే దక్షిణ భారత దేశంతో పాటు దేశంలో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు దృష్టి సారించారు. అఖండ మెజారిటీతో గత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా తామేంటో నిరూపించుకున్న భారతీయ జనతాపార్టీ ఈ మధ్యకాలంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నా విషయం తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్రలో అయితే తమ రాజకీయ అనుభవాన్ని  మరియు చతురతను సరిగ్గా వినియోగించుకోలేక చివరి దశలో బొక్క బోర్ల పడిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మళ్ళీ కర్ణాటకలో తామేంటో నిరూపించుకొని తమ సత్తా దేశం మొత్తానికి చూపించాలని ఉంది.

 

అయితే 15 అసెంబ్లీ సీట్లకు గానూ నేడు ఉప ఎన్నికలు జరుగుతుండగా పాలనలో ఉన్న భారతీయ జనతా పార్టీకి మరొక ఆరు సీట్లు వస్తే తమ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంది. ప్రస్తుతం యడ్యూరప్ప నేతృత్వంలోని కొనసాగుతున్న బిజెపికి 106 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఒక ఇండిపెండెంట్ క్యాండెట్ కూడా మద్దతు ఇస్తున్నాడు. మామూలుగా కర్ణాటకలో హౌస్ యొక్క సామర్ధ్యత 224 ఎమ్మెల్యేలు కాగా వారిలో 17 మంది కాంగ్రెస్ మరియు జెడిఎస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీకి తరలిపోవడంతో కుమారస్వామి ప్రభుత్వం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 

 

అయితే స్పీకర్ రమేష్ కుమార్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం మరియు సుప్రీంకోర్టు కూడా ఇందులో తమ నిర్ణయాన్ని ప్రకటించడంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ వారు ఇప్పటికే బిజెపికి ఓటమి భయం పట్టుకుందని అందుకే 'ఆపరేషన్ కమల' ద్వారా తమ ఎమ్మెల్యేలను వారి వైపు మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు.

 

కర్ణాటక కాంగ్రెస్ ప్రెసిడెంట్ దినేష్ రావు మాట్లాడుతూ తమ అభ్యర్థులకు డబ్బుతో పాటు క్యాబినెట్లో మంత్రి పదవులను ఇస్తామని వారి వైపు లొంగదీసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇదే కనుక జరిగితే తాము సహించేది లేదని ఓటమి భయంతో వారు ఏదో చేస్తున్నారని.... ఇలా అయితే కాంగ్రెస్ పార్టీనే కాకుండా ప్రజలను కూడా మళ్ళీ ఇటువంటి అప్రజాస్వామిక పనులు జరిగితే రోడ్ల మీద తరిమితరిమి కొడతారని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: