తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఇంత కీలకమైన వ్యక్తి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పార్టీలో తండ్రి కొడుకుల తర్వాత ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్న నేత హరీష్ రావు. తన మద్దతుదారులతో ఒక సైన్యమే నిర్మించగల కెపాసిటీ ఉన్న ఈ నేతను మొదట్లో కెసిఆర్ అతనిని కొడుకు పైన ఉన్న అతి ప్రేమతో అసలు పట్టించుకోకుండా పక్కన పెడుతున్నారని చాలా ఆరోపణలు వచ్చాయి. అయితే ఎప్పటికప్పుడు హరీష్ రావు తాను పార్టీకి ఎప్పటికీ విధేయుడు అని నిరూపించుకుంటూ ఉండగా కెసిఆర్ కూడా తన సమయం తీసుకుని హరీష్ రావుకు ముఖ్యమైన మంత్రి పదవిని తన క్యాబినెట్ లో కట్టబెట్టారు.

 

ఇక ప్రస్తుత విషయానికి వస్తే హరీష్ రావు ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ వారికి ఇచ్చిన హామీలు చూసి తనకు భయం వేసింది అని అన్నాడు. ఆర్టీసీ సమస్యపై మాట్లాడుతూ కేసీఆర్ ప్రతి బడ్జెట్లో కేవలం ఆర్టీసీ వారి కోసమే 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించగానే నా గుండె ఒక్కసారిగా జారిపోయింది అన్నారు ఈ ఆర్థిక శాఖ మంత్రి. అయితే దీని గురించి అతను ఏదైనా సమస్య అవుతుందని ఇంకా ఎక్కువ చెప్పకపోగా కెసిఆర్ తీసుకునే నిర్ణయంపై హరీష్ రావు అయితే అసంతృప్తిగా ఉన్నారనే విషయం బాగా అర్థమవుతుంది.

 

ఇకపోతే ఈ పాపులర్ నేత మాట్లాడుతూ ఒక రాష్ట్ర ఆర్థిక శాఖను హ్యాండిల్ చేయడం చాలా కష్టమైన పని అని... ఇందులో ఉన్న వనరులను సరిగ్గా వాడుకోవడమే చాలా ముఖ్యమైన విషయం అని అన్నాడు. ముందు నీటిపారుదల శాఖ మంత్రిగా అనుభవం ఉన్న ఈయన దానికి ఆర్థిక శాఖ మంత్రి చేసే పనులకి చాలా వ్యత్యాసం ఉందని అయితే తాను మాత్రం తన శక్తికి మించి పని చేస్తానని హామీ ఇచ్చారు. అయితే కెసిఆర్ హరీష్ రావు అన్న మాటలను సీరియస్ గా తీసుకుని అతను కేటాయించిన వెయ్యి కోట్ల రూపాయల హామీ లో ఏదైనా మార్పు చేస్తాడో లేదో చూడాలి. అయితే మరి కొద్ది నెలల్లో హరీష్ రావు జనం ముందు పెట్టబోయే బడ్జెట్ పైన ఇప్పుడు అందరి కళ్లు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: