ఈ రోజుల్లో సిని రంగాన్ని మించిన వ్యాపారం లేదు అనేది వాస్తవం. సినిమాల్లో పెట్టుబడులు పెట్టిన వాళ్లకు ఇబ్బంది ఉండటం లేదు. గతంలో సిని పరిశ్రమ మార్కెట్ ఎక్కువగానే ఉన్నా ఇప్పుడు మాత్రం అది ఆదాయం పెంచుకుని అతి పెద్ద మార్కెట్ గా మారడంతో నిర్మాతల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. భారీ బడ్జెట్ సినిమాలకు భారీగా వసూళ్లు రావడం. కథల్లో మార్పులు రావడంతో నిర్మాతలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో రాజకీయాల్లో ఉన్న వారు కూడా సినిమాల నిర్మాణ౦ మీద దృష్టి పెట్టారు.



తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రులు ఇప్పటికే సిని రంగంలో తమ సన్నిహితుల ద్వారా భారీగా పెట్టుబడులు పెట్టారు. ఒక అగ్ర హీరోతో సినిమా చెయ్యడానికి వాళ్ళు ముందుకి వచ్చారు. సినిమా ఆలస్యం అయినా పర్వాలేదు ఆదాయం వస్తుంది కదా అని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 8 మంది ఎమ్మెల్యేలు తమిళంలో కూడా పెట్టుబడులు పెట్టడానికి చూస్తున్నారు. త‌మిళం లో ఏదేని సినిమాలో పెట్టుబ‌డులు పెడితే అక్క‌డ విస్త‌రించ‌డంతో పాటు ఆదాయ‌పు ప‌న్ను ఇత‌ర‌త్రా అంశాల విష‌యంలో ఎవ్వ‌రికి ఎలాంటి సందేహాలు రావ‌న్న దే ఆ ఎమ్మెల్యే ల ఆలోచ‌న‌గా తెలుస్తోంది.



రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు చెన్నైలో తమ పరిచయాలతో పెట్టుబడులకు సిద్దమయ్యారు. ఇక ఆంధ్రకు చెందిన ఇద్దరు మంత్రులు, టాలివుడ్ లో పెట్టుబడులు పెట్టేందుకు గాను సొంత సామాజిక వర్గానికి చెందిన ఒక నిర్మాత ద్వారా ప్రయత్నాలు మొదలుపెట్టారట. చిన్న సినిమా అయినా పర్వాలేదు అన్నా మేము పెట్టుబడులు పెడతామని అంటున్నారట మంత్రులు.


వాటికి అయితే ఏ ఇబ్బందులు ఉండవు, భవిష్యత్తులో దాడులు కూడా ఉండవు... ఇప్పుడు ఏ కాంట్రాక్టులు చేసినా సరే ఐటి ఇబ్బందులు వస్తున్నాయని భయపడుతున్నారట రాజకీయ నాయకులు. అందుకే పెట్టుబడులు పెట్టాలి అనుకునే రాజకీయ నాయకులకు ఇప్పుడు టాలివుడ్ అనువైన వేదికగా మారిందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: