కట్టమంచి మల్ల రెడ్డి  అనగానే తెలంగాణ రాష్ట్రము లోనే కాదు ఆంధ్ర రాష్ట్రము లో కూడా అయన ఒక పెద్ద వ్యాపారవేత్త అని, తెలంగాణ లో  ప్రఖ్యాత కలిగిన విద్యాలయాల అధినేత అని మంత్రి అని అందరికి తెలుసు కానీ అతడు ఒక సామాన్యమైన జీవితం గడిపాడని పాల వ్యాపారం చేసి అంచలంచెలుగా ఎదిగాడని ఇటీవల నిర్వహించిన ఒక సమావేశం లో తనను తానే  పొగుడుకున్నాడు.  కష్టపడితే సాధించలేనిది ఏది లేదనడానికి  దానికి తానే నిదర్శం అని మంత్రి మల్లారెడ్డి చెప్పారు.

తాను చిన్నప్పుడు సైకిల్ మీద తిరుగుతూ పాలు సరఫరా చేపేవాడినని ఇప్పుడు మంత్రి అయ్యానని ఆయన  గొప్పగా తెలిపారు. పాల వ్యాపారంతో ప్రారంభమైన అతడి జీవితం విజయవంతంగా  మల్లారెడ్డి విద్యా సంస్థల స్థాపించే  వరకు వచ్చిందని అతడు పడ్డ కస్టాలు ఎవరి పది ఉండరని అతడి కష్టాలకు ప్రతిఫలమే నా ఈ విద్యాసంస్థలు అని గొప్పగా  తెలియచేసారు.  అయన ఇటీవల జరిగిన శాసన సభ సమావేశాలలో కూడా ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానము ఇస్తూ ఒక పేపర్ లో రాసిన దాన్ని పదే పదే జదువుతూ అంత నా వల్లే జరిగిందని నేనే చేసానని అతడు వివరించిన పద్ధతి అందరిచేత నవ్వుని తెప్పించాయి.

మంత్రి కేటీర్ కూడా పడి పడి నవ్వుకున్నారు అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు అతడిని హేళన చేసి ఎవరో రాసిచ్చిన మాటలను చదివాడని ఎలాంటి వారిని మంత్రి అయ్యారని ఇదంతా మన కర్మ అని అవమానించారు. నిజానికి మంత్రి మల్ల రెడ్డి పెద్దగా చదువుకోలేదు కానీ వ్యాపారం చేసి బాగా కూడబెట్టి ఎదిగాడు. ఈ మధ్య అయన ఎక్కడ మాట్లాడిన ఇలాగే తన గురించి తానే  డబ్బాలు కొట్టుకోవడం  అలవాటైంది అని  వాపోయారు. ఇటీవల జరిగిన  టీఎస్-ఐపాస్  ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా మంత్రి  అలాగే మాట్లాడారు. TS-ఐపాస్ సక్సెస్ కావడం పట్ల మంత్రి మల్లారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దీని కోసం కృషి చేసిన మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలోనే కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: