ఆంధ్ర రాజధాని అమరావతిపై రాజకీయం చాల వేడి వేడిగా ఉంది. రౌండ్ టేబుల్స్ వేధికగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. అమరావతిని అంతర్జాతీయ రాజధానిగా చేస్తామన్న టీడీపీ నేతలు అంతర్జాతీయ కుంభకోణంగా మార్చారని రాజధాని రైతులు ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణమే అసలు కోణం అనే పేరుతో వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో గుంటూరులో ఈరోజు గురువారం రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 

                  

ఈ సమావేశంలో రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, రాజధాని ప్రాంత రైతులు పాల్గొన్నారు. అయితే ఒకవైపు విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్ లో టీడీపీ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుంది. మరో వైపు దీనికి వ్యతిరేక రైతు వర్గం కూడా అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తోంది. ఇలా అమరావతిలో పోటాపోటీ రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. 

                        

అయితే ఈ సమావేశాలకు హాజరైన మంత్రి బుగ్గన, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతులను గత ప్రభుత్వం మోసం చేసింది అని, అమరావతి కోసం, చంద్రబాబు బాబు హయాంలో 9060 కోట్లు ఖర్చు చూపింది అని అయితే వాటిలో 5674 కోట్లు ఖర్చు చేసారు అని, ఆర్కిటెక్ట్ కంపెనీలతో 840 రూ కోట్లు మోసం చేశారని, 100 శాతం పూర్తయిన ఒక్క బావనమైన చూపించండి అని బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా అంబటి రాంబాబు, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో వైపు టీడీపీ నాయకులు సైతం రౌండ్ టేబుల్ లో సమావేశంలో సంచలన వ్యాఖ్యలు. ఇలా ఆంధ్ర రాజకీయాలు కాస్త వేడెక్కాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: