ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో మళ్ళీ పొలిటికల్ హీట్ పెరిగింది. రాజధాని అమరావతి పై ఇటు ప్రతిపక్ష టీడీపీ అటు అధికార వైసీపీ పోటాపోటీగా అమరావతిపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశానికి సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జనసేన నుంచి పోతిన మహేష్, ఆర్ఎస్పీ నుంచి జానకి రాములు, ఫార్వార్డ్ బ్లాక్ ,లోక్ సత్తా, ఆమ్ ఆద్మీ పార్టీల నాయకులతో పాటు పలు ప్రజా సంఘాల నేతలు, రాజధాని ప్రాంతప్రజలు పాల్గొన్నారు. 

 

ఈ సమావేశానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తాము రాలేమని చెప్పారు. విజయవాడ ఏ1 కన్వెన్షన్ సెంటర్లో టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఇక అమరావతిపై చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని పై వైసీపీ ప్రభుత్వం లేనిపోని అపోహలు సృష్టించి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి రాజధాని అయిన హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేసానని చెప్పారు.

 

సంపద సృష్టించి మన రాష్ట్ర పౌరులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా చూడాలని భావించానని, రాష్ట్రము గర్వపడేలా అమరావతిని నిర్మించాలని భావించానని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వల్ల సింగపూర్ ప్రభుత్వం ఒప్పందం రద్దు చేసుకుని మధ్యలోనే వైదొలిగిందని ఆరోపించారు. అభివృద్ధి చెందిన నగరాలకు ధీటుగా అమరావతిని నిర్మించాలని భావించానని పేర్కొన్నారు.

 

ఒకవేళ రాజధాని విషయంలో నేను ఏమైనా తప్పు చేసానని ప్రజలు భావిస్తే క్షమాపణ చెప్పడానికి సిద్ధమని పేర్కొన్నారు. ఈ సందర్బంగా జగన్ సర్కార్ తాజాగా ఆరోగ్యశ్రీ పథకంలో తెచ్చిన మార్పులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మన రాష్ట్ర సొమ్మును పక్కా రాష్టాలకు ఇస్తున్నారని, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకుంటే ఆ రాష్ట్ర హాస్పిటళ్ళకు డబ్బులు వస్తాయని దాని వల్ల ఏపీ సొమ్ము పరాయి రాష్ట్రాలకి తరలి వెళ్ళుతుంది అని పేర్కొన్నారు. దీనికి బదులుగా మన రాజధానిలోనే మంచి హాస్పిటళ్లను నిర్మించుకుంటే రాష్ట్ర డబ్బు ఆదా అవుతందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: