వైసీపీ ప్రభుత్వం అమరాతి రాజధానిపై ఇష్టాను సారంగా వ్యవహరిస్తోందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు రాజధానిపై రోజుకో రకమైన వివాదాలు సృష్టిస్తున్న వైసిపి, రాష్ట్ర రాజధాని విషయంలో చేస్తున్న రగడ రాష్ట్రానికి నష్టం చేస్తుందనే విషయాన్ని టిడిపి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకుంది. అందుకోసం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో చంద్ర బాబు పాల్గొన్నారు. అమరావతిలో ఏం జరుగుతోందో ప్రజలకు చెప్పడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ..జగన్ పరిపాలనతో రాజధానిగా అమరావతి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని అన్నారు.  

 

చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఎమ్మెల్యే బాలకృష్, అచ్చెన్నాయుడు, సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జనసేన నుంచి పోతిన మహేష్‌, ఆర్‌ఎస్‌పీ నుంచి జానకి రాములు, ఫార్వర్డ్‌ బ్లాక్‌, లోక్‌సత్తా, ఆమ్‌ ఆద్మీ, ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. అమరావతి.. ప్రతి తెలుగు బిడ్డ గర్వించదగ్గర ప్రపంచస్థాయి నగరమని చంద్రబాబు అన్నారు. యువతకు ఉద్యోగాలను ఇచ్చే కల్పించే కల్పవల్లి అని తెలిపారు. రాష్ట్రం, సమాజమే శాశ్వతమని.. వ్యక్తులు శాశ్వతం కాదని స్పష్టం చేశారు.

 

ప్రజారాజధాని అమరావతి పై ప్రజల్లో జగన్ ప్రభుత్వం అపోహలు తెస్తుందని మండిపడ్డారు. తెలంగాణా రాష్ట్ర రాజధాని భాగ్యనగరమని.. ప్రస్తుతం తెలంగాణారాష్ట్ర  ముఖ్యఆదాయానికి హైద్రాబాదే కారణం అన్నారు. అదే తరహాలో అమరావతి రాజధానిని చేయాలనుకున్నాని వివరించారు. అమరావతి భావితరాల భవిష్యత్ అని.. ప్రజా రాజధానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు చంద్రబాబు.

 

అమరావతి ప్రజా రాజధాని అని... అదే గనుక తాను కోరుకున్నట్లు నిర్మాణం జరిగితే ప్రతి పౌరుడు గర్వించేలా వుంటుందన్నారు. అమరావతి ప్రాజెక్టు తప్పు అని ఒకవేళ ప్రజలంటే.. క్షమాపణ చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. అలా అనడానికి ఆస్కారం లేకుండా పారదర్శకంగానే తాను రాజధానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నాని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: