ఇటీవల దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం రేపిన దిశ ఘటన పై పలువురు ప్రజలతో పాటు పలు సంఘాల వారు సైతం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ దారుణ ఘటనలో ప్రియంకను ఎంతో ఘోరంగా హింసించి అత్యాచారం చేసి, ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితులను ఎంతో కఠినంగా శిక్షించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై నిందితుల తల్లితండ్రులు కూడా వారిని ఘోరంగా శిక్షించాల్సిందే అని కోరుతున్నారు. 

 

ఇక ఈ ఘటన తరువాత కేంద్ర ప్రభుత్వం కూడా నిందితులు కేసు నుండి ఏ విధంగా తప్పించుకునే వీలు లేకుండా పలు కట్టుదిట్టమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ఈ తాజా ఘటనపై పలువురు సెలెబ్రిటీలు సైతం ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దేశంలో అమ్మాయిల మానాలకు రక్షణ లేకుండా పోయిందని, ఈ దారుణానికి పాల్పడిన నిందితులకు దారుణమైన శిక్షలు వేస్తేనే భవిష్యత్తులో ఇటువంటి తప్పులు చేయాలనుకునే వారు భయపడతారని అంటున్నారు. ఇక ఈ ఘటనపై మొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఒక ఆడబిడ్డను అంత దారుణాతి దారుణంగా అత్యాచారం చేసి చంపిన నిందితుల పై తనకు కూడా పట్టలేనంత కోపం ఉందని, 

 

అయితే అటువంటి వారిని ఉరి శిక్షతో శిక్షించడం కంటే, గట్టిగా నాలుగు దెబ్బలు వేసి బుద్ది చెప్పండి అంటూ వ్యాఖ్యానించడం జరిగింది. కాగా పవన్ చేసిన ఆ వ్యాఖ్యలపై చాలా మంది నుండి నిరసన వ్యక్తం అవుతోంది. ఇక పవన్ వ్యాఖ్యలపై సీనియర్ హీరో సుమన్ నేడు స్పందిస్తూ, ఆయన వ్యాఖ్యలను పూర్తిగా తప్పుబట్టారు. అంతటి ఘోర కలికి పాల్పడిన నీచులను కఠినాతి కఠినంగా శిక్షించాలని అందరూ కోరుతుంటే, పవన్ కళ్యాణ్ గారు మాత్రం వారిని శిక్షించకుండా కేవలం దెబ్బలు కొట్టి వదిలేయమనడం సరైనది కాదని, అటువంటి ఘటన వారి ఇంట్లోని ఆడవాళ్లకు జరిగితే, ఒకవేళ దిశ వారి ఇంట్లో అమ్మాయి అయితే, పవన్ అలానే మాట్లాడతారా అంటూ ఆగ్రహంగా సుమన్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: