మనుషులు మృగాలుగా మారారు.. తమ కామ వాంఛ కోసం ఎలాంటి దారుణాలకైనా తెగబడుతున్నారు.  యావద్ భారత దేశాన్ని ఒక్కసారిగా ఛలించిపోయేలా వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచార, హత్య కేసు పై ప్రతి ఒక్కరూ తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు.   దిశపై క్రూర మృగాలు చేసిన అకృత్యం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.  మొన్న పార్లమెంట్ లో దిశ విషయంపై  నేతలు దద్దరిల్లేలా మాట్లాడారు. ఇక సినీ, రాజకీయ సెలబ్రెటీలు దిశ కుటుంబాన్ని కలిసి ధైర్యం చెబుతున్నారు.  ఈ కేసు విషయం తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.  కొందరైతే ఇటువంటి క్రూరుల్ని మేమే చంపేస్తామని ఆగ్రహావేశాల్ని వెళ్లగక్కుతున్నారుఈ క్రమంలో దిశ కేసులో మహబూబ్‌నగర్‌లో ఫాస్ట్‌ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు అనుమతి ఇస్తూ బుధవారం (డిసెంబర్ 4) హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.  

 

నిందితులపై ఏ మాత్రం కనికరించవద్దనీ..ఇటువంటి మావన మృగాలు సభ్య సమాజంలో తిరగటానికి వీల్లేదని వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా కఠినాతి కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.  దిశ హత్యాచార దర్యాపును పోలీసులు ముమ్మరం చేశారు. ఘటన జరిగినప్పటి నుంచి కనిపించకుండా పోయిన దిశ సెల్‌ఫోన్‌ను పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు. ఘటన స్థలానికి అర కిలోమీటర్‌ దూరంలో సెల్‌ఫోన్‌ లభ్యమైంది. ఘటన స్థలానికి దూరంగా నిందితులు దిశ సెల్‌ఫోన్‌ను భూమిలో పాతిపెట్టారు. ఈ సెల్ ఫోన్ తో పాటు మరికొన్ని కీలక వస్తువులు లభ్యమైనట్లు తెలుస్తుంది.  ఘటనకు సంబంధించి మరికొన్ని ఆధారాల కోసం పోలీసులు లారీ కెబిన్‌లో తనిఖీ చేస్తున్నారు.

 

కేసు దర్యాప్తునకు పోలీసులు ఏడు బృందాలతో సిట్‌ ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్ మొదటి అదనపు సెషన్స్, జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం దిశా హత్య కేసు నిందితులు చర్ల పల్లి జైలులో ఓ ప్రత్యేక నిఘాలో ఉన్నారు. వీరికి కాపలా కాస్తున్న కొంత మంది సిబ్బంది వారితో మాటా మాటా కలిపినప్పుడు.. ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని విషయాలను ఈ నలుగురు బయట పెట్టినట్లు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఫోన్ లభ్యం కావడంతో పోలీసులు ఈ కేసులో మరింత పురోగతిని సాధించినట్టైంది. కాల్ లీస్ట్, కాల్ రికార్డ్ ను పరిశీలిస్తున్న పోలీసులు.  ఆరు రోజుల పాటు నిందితులను పోలీసులు విచారించే అవకాశం ఉంది.  నింధితులకు సరైన శిక్ష పడేలా చేస్తామంటున్నారు పోలీస్ అధికారులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: