ఆంధ్ర ప్రదేశ్  సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరుతున్నారు. రెండురోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు సీఎం జగన్ ఢిల్లీకి చేరుకుంటారు అని తెలిపారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులతో సమావేశముకానున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం రోజు ఉదయం.. లేదా మధ్యాహ్న సమయంలో ప్రధాని మంత్రి మోదీని సీఎం జగన్ కలుసుకోబోతున్నట్లు సమాచారం.

 


     ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గత రెండు రోజులుగా ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.ఈ ప్రయత్న భాగంలో ఈ రోజు ప్రధాని అపాయింట్‌మెంట్ ఖరారైనట్లు తెలియ వచ్చినది. అందువల్లే సీఎం జగన్ హడావిడిగా ఢిల్లీకి బయల్లేదేరి వెళ్తున్నట్లు సమాచారం. గురువారం అనంతపురం జిల్లాలోని కియా కార్ల ఫ్యాక్టరీ ఓపెనింగ్ సెరిమనీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరైనారు.ముఖ్యమంత్రి జగన్.. తిరిగి తాడేపల్లిగూడెం చేరుకోవాల్సి ఉంది. అయితే ప్రధాని అపాయింట్‌మెంట్ ఖరారైన సందర్భములో ఆయన అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు తాడేపల్లిగూడెం కార్యక్రమము వాయిదా వేయడం జరిగినది..

 


    ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు ,పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి , ఇంకా మన రాష్ట్రానికి కావలసిన పరిశ్రమలు,తదితర విషయాలపై సీఎం జగన్ ప్రధానితో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు టెండర్లను జగన్ సర్కార్. రద్దు చేసిన విషయం మనకందరికీ తెలిసిన అటువంటిదే.. రివర్స్ టెండరింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

 

 

ఇప్పటికే ఆ విషయాన్ని ప్రధాన మంత్రి మోడీ గారికి విన్నవించిన సీఎం.. మరోసారి నిధుల విడుదలపై చర్చించే అవకాశం కూడా ఉంది. త్వరితగతిన కావలసిన నిధులు విడుదల చేసి పనులు వేగవంతంగా జరిగేందుకు సహకరించాలని. మాట్లాడే విషయం. అలాగే అమరావతి నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ప్రధానమంత్రిని కోరనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: