జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తిరుపతిలో పర్యటిస్తున్నాడు.. అయితే ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ దిశా ఘటనపై స్పందిస్తూ ఇలా మాట్లాడారు, ' ఆ నలుగురు నిందితులను తీసుకెళ్ళి జైల్లో పెడితే... జనం అందరూ కొన్ని వేల మంది అక్కడి వచ్చి... చంపేయండని అంటున్నారు... ఢిల్లీ స్థాయిలో ఒక జడ్జి అన్న మాటలు ఏంటంటే... (వాళ్ల) మగవాళ్ల అంగాలను కోసేయండని అన్నారు. అంటే ఒక జడ్జికి కూడా అంత కోపం వచ్చిందంటే.. నేనేం అంటున్నానంటే... అసలు మీరు అంత స్థాయికి ఎందుకు పట్టుకెళ్తారు?... మీరందరూ(ప్రజలు) ఏమంటున్నారు? నడిరోడ్డు మీద బహిరంగంగా ఉరి తీయాలి అంటున్నారు. అసలు మనిషిని చంపే హక్కు కూడా మనకు లేదు. కానీ ఒక మనిషిని శిక్షించక పోతే కూడా...(నిశ్శబ్దం/గ్యాప్) శిక్ష ధర్మం చాలా ముఖ్యం.. సింగపూర్ తరహాలో నేను కోరుకునేది... కచ్చితంగా బెత్తం దెబ్బలు ఉండాలి. ఒక ఆడపిల్ల బయటకి వెళ్లి తిరిగి రావడానికి ఏదైనా జరిగితే.. ఆ చేసిన అబ్బాయిని రెండు బెత్తం దెబ్బలు కొట్టండి. ఎట్లా దెబ్బలు కొట్టాలంటే... చెమ్డాలు ఊడిపోయేలా కొట్టండి. అందరూ చూస్తుండగా కొట్టండి" అంటూ మాట్లాడాడు.


అయితే... అమ్మాయిని వేధిస్తే... వారిని రెండు దెబ్బలు కొట్టాలని.. ఉరితీయడం కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు... పెద్ద దుమారం రేపుతున్నాయి.

ఈ సందర్భంలోనే ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత పవన్ కళ్యాణ్ అలా వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు.. ఆమె మాట్లాడుతూ... 'ఎవరైతే మహిళ మీద లైంగిక దాడి చేస్తారో.. వారిని బహిరంగంగా ఉరి తీయడం, జీవిత ఖైది శిక్ష విధించడం, ఇలా రకరకాల కఠినమైన శిక్షలు ఉన్న దగ్గరే.. నేరాలు జరుగుతూ ఉంటే కేవలం రెండు దెబ్బలు వేసి వదిలేస్తే.. నేరాలు కంట్రోల్ అవుతాయా?' అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పారు.

ఇంకొక వైసీపీ నేత... తన అక్క, చెల్లి జోలికి వచ్చిన వారిని మాత్రం చంపేయండి అని అంటాడు... వేరే వాళ్ళు విషయానికి వస్తే ఇలా మాట్లాడుతున్నాడు... ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతే...(బాగోదు) ప్రజాస్వామ్య ప్రజాసేవలో ఉన్నప్పుడు అందరు గమనిస్తూనే ఉంటారు నీ వేషాలు అంటూ ఎద్దేవా చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: