బుధవారం మాజీ ప్రధాన మంత్రి అయిన ఐకే గుజ్రాల్ శత జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు మన దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ 1984లో హోం శాఖ మంత్రిగా ఉన్న పీవీ నరసింహారావు పై ఆసక్తికర విషయాలు తెలియజేశారు.1984లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్య జరిగిన తర్వాత ఐకే గుజ్రాల్ మాటలు  పీవీ నరసింహారావు విని ఉంటే సిక్కు అల్లర్ల జరిగేవి కావని మన్మోహన్ సింగ్ అన్నారు.

 

కానీ ఈ మాటలు పెద్ద దుమారం లేపే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ మన్మోహన్ సింగ్ ఇలా అన్నారు. 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరుగుతున్న సమయంలో ఐకే గుజ్రాల్ పనికట్టుకొని పీవీ నరసింహారావు ఇంటికి వెళ్లి ఆయనకు పరిస్థితి చేయి దాటిపోయే అవకాశం ఉంది అని చెప్పారు. వీలైనంత త్వరగా ప్రభుత్వం ఆర్మీ ని రంగంలోకి దింపాలసిన అవసరం ఉందని చెప్పారు.

 

ఆయన ఇచ్చిన సలహాపై పి.వి.నరసింహారావు శ్రద్ధ పెట్టి ఉంటే సిక్కు వ్యతిరేక అల్లర్లు జరగకపోయేవి అని మన్మోహన్ సింగ్ 35 సంవత్సరాల తర్వాత ఈ మాటలు చెప్పారు. 1984 అక్టోబర్ 31వ తారీఖున అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పై ఆమె వ్యక్తిగత  కాపలాదారులు దాడులు చేసి దారుణ హత్యకు పాల్పడ్డారు. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా అల్లర్లు సిక్కుల ఊచకోతకు దాదాపు 3000 మంత్రి తమ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.  

 

గుజరాల్ మన దేశ ప్రధానిగా కూడా పని చేసారు. గుజరాల్ అనారోగ్య కారణంతో 2012 నవంబర్ 30న కన్నుమూశారు. దాదాపు 35 సంవత్సరాల తర్వాత ఈ విషయాన్ని బయటికి తీయడానికి కారణం ఏమిటో మన్మోహన్ సింగ్ మాత్రమే తెలియాలి. దీని వల్ల కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగడం కచ్చితంగా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: