వెర్రి వేయివిధాలు అనుకోవాలో..ఇత‌రుల‌కు శృతిమించిన హ‌క్కులు త‌మ‌పై క‌ల్పించుకోవ‌డ‌మో తెలియ‌దు కానీ..ఓ అమ్మాయి త‌న జీవిత భాగ‌స్వామి విష‌యంలో ఊహించ‌ని నిర్ణ‌యం తీసుకుంది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన ఈ చిత్ర‌మైన `పెళ్లికి ముందే డైవ‌ర్స్` క‌థ‌లో అనేక ట్విస్టులు ఉన్నాయి. ఎనిమిదేళ్ల పాటు ప్రేమించుకొని ఇద్ద‌రం క‌లిసి బ్ర‌తుకుదామ‌ని నిర్ణ‌యం తీసుకొని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమై.... వ‌చ్చే ఫిబ్ర‌వ‌రీలో డేట్‌‌‌‌‌‌‌‌ ఫిక్స్‌‌‌‌‌‌‌‌ చేసుకొని...పెళ్లి డ్రెస్‌‌‌‌ కూడా డిజైన్‌‌‌‌‌‌‌‌ చేయించుకున్న త‌ర్వాత ఉన్నట్లుండి అమ్మాయి పెళ్లికి నో చెప్పింది. అబ్బాయికి షాకిచ్చింది. దీంతో ల‌బోదిబోమ‌న‌డం ఆ పెళ్లికొడుకు వంతు అయింది.

 

హాంకాంగ్‌ హక్కులను హరించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలపై భయాందోళన వ్యక్తంచేస్తున్న హాంకాంగ్‌వాసులు గత ఆరు నెలల నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం విదితమే. వారిని నిలువరించేందుకు పోలీసులు వారిపై టియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్యాస్‌‌‌‌‌‌‌‌, రబ్బర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుల్లెట్లతో దాడి చేసి చాలా మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. ఇలా హాంకాంగ్‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న ఆందోళనలు దేశ ప్రజలను రెండు గ్రూపులుగా విడిపోయేలా చేశాయి. దీంతో ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌, లవర్స్‌‌‌‌‌‌‌‌ కూడా విడిపోతున్నారు. ప్రో – డెమోక్రసీ కార్యకర్త మే న్యుపిటాల్‌‌‌‌‌‌‌‌, హాంకాంగ్‌‌‌‌‌‌‌‌లోని ఒక పోలీస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఫిబ్రవరిలో పెళ్లి చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే.. మే ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌ దానికి అడ్డు చెప్పారు. ఆందోళనకారులను కొట్టి, అరెస్టు చేసిన పోలీస్‌‌‌‌‌‌‌‌ను ఎలా పెళ్లి చేసుకుంటావని అడగటంతో ఆలోచించిన ఆమె పెళ్లిని క్యాన్సిల్‌‌‌‌‌‌‌‌ చేసుకుంది. పెళ్లికి ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌ రామని చెప్పడంతో దిక్కు తోచని స్థితిలో పెళ్లిని క్యాన్సిల్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నానని మే మీడియాతో చెప్పింది. 

 


ఇదిలాఉండ‌గా, జిల్లాస్థాయి స్థానిక సంస్థలకు గత నెల 24న జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్య అనుకూలవాదులు ఘనవిజయం సాధించడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళనకారులు నిరసన ప్రదర్శనల జోరు పెంచుతున్నారు. చిన్నారులు సహా అనేకమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ప్రభుత్వం ఇప్పటికీ మా గోడును పట్టించుకోవడంలేదు. మా నిరసనలు కొనసాగుతాయి’ అని ఓ విద్యార్థి పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: