సీనియర్ రాజకీయ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు అసత్య ఆరోపణలతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు అని అన్నారు. ఇప్పటికే అమరావతిని రాజధానిగా ఉంచాలని లేకపోతే మార్చాలన్న విషయంపై ప్రభుత్వం ఇలాంటి స్టేట్మెంట్ చేయకుండానే ప్రజలను డైలమా లో పడేసేందుకే చంద్రబాబు ఇటువంటి బురద జల్లుడు కార్యక్రమం చేస్తున్నారని రాంబాబు అన్నారు.

 

ఈమధ్య చంద్రబాబు ఆయన సమక్షం లోనే నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశాలు అన్నీ కేవలం అధికార పక్షం పైన ఏదో ఒక రీతిలో బురద చెందేందుకు ఆడుతున్న డ్రామా అని ఆయన నొక్కి వక్కాణించాడు. ఇకపోతే రాష్ట్ర ప్రజలందరినీ రాజధాని పేరుతో భయ భ్రాంతులకు గురి చేసి గందరగోళం సృష్టించాలని చంద్రబాబు చూస్తున్నట్లు ఆయన ఆరోపించాడు. ఇంకా బాబు ఈ మధ్య చేస్తున్న పనులు అన్నీ కూడా ప్రజలకు ఏది మంచి, ఏది అవసరం అన్న విధంగా కాకుండా ఎక్కడ సందు దొరికితే అక్కడ జగన్ ప్రభుత్వాన్ని నిందించేందుకే చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని అంబటి రాంబాబు మాట. 

 

ఇటీవల ఆరోగ్యశ్రీ పథకం పై వస్తున్న తప్పుడు ప్రచారం కూడా చంద్రబాబు కుట్రపూరితమైన రాజకీయాల్లో ఒక భాగమే అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. తమ పరిపాలనలో వారికి చేతకాని విషయాలను జగన్ ఎంతో సమర్ధ పూర్వకంగా అధికారం చేపట్టిన ఆరునెలల్లోనే చేస్తుంటే అసూయతో తెలుగుదేశం పార్టీ నేతలంతా ఆయనపై మూకుమ్మడిగా చేస్తున్న ఈ దాడిని తాము ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ తతంగమంతా చూస్తుంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనుల్లో బిజీగా ఉండగా ప్రతి పక్షం వారు మాత్రం కేవలం ఎక్కడ సందు దొరికితే ఆ అవకాశాన్ని వదలకుండా అతనిని విమర్శించడమే అదేపనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది అంటున్నారు ప్రజలు.

మరింత సమాచారం తెలుసుకోండి: