తెలంగాణాలో బలపడాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ తెరాస పార్టీని టార్గెట్ చేసింది అనే వ్యాఖ్యలు ఎప్పటి నుంచో వినపడుతున్నాయి. రాజకీయంగా బలంగా ఉన్న కెసిఆర్ ని ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం సిద్దంగా ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఇటీవల మహారాష్ట్రలో అధికారం కోల్పోయిన ఆ పార్టీ కీలక రాష్ట్రాన్ని కోల్పోయినట్లు అయింది. ఈ నేపధ్యంలో ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల మీద ఎక్కువగా దృష్టి సారించింది. రాజకీయంగా బలంగా ఉన్న కెసిఆర్ ని బలహీనపరిచేందుకు గాను తెరాస నేతలను లాక్కునేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్న ఆ పార్టీ ఇప్పుడు ఉద్యమ నేతలను బెదిరించే ప్రయత్నం చేస్తుందని అంటున్నారు. 

 

ఆర్టీసి సమ్మె ద్వారా కెసిఆర్ తీసుకున్న కొన్ని నిర్ణయాల పట్ల తెరాస లో వ్యతిరేకత వచ్చింది. ఇది పైకి మీడియా చూపించకపోయినా సరే... పార్టీలో మాత్రం చీలిక వచ్చింది. ఇప్పుడు దీనిని లక్ష్యంగా చేసుకుని బిజెపి కొందరు నేతలను తమ వైపుకి లాక్కునే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఆర్ధికంగా అండగా ఉన్న వాళ్ళను లక్ష్యంగా చేసుకుని ఐటి దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల మేఘా కృష్ణ రెడ్డి, సిని పరిశ్రమలో కూడా ఐటి దాడులు ఎక్కువగా జరిగాయి. 

 

ఇక అంతే కాకుండా ఇప్పుడు తెలంగాణ‌లో తెరాస‌కు చెందిన‌ మంత్రులను కూడా బిజెపి టార్గెట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా సోషల్ మీడియాలో జరుగుతుంది. మంత్రుల శాఖల మీద హోం శాఖ దృష్టి సారించిందని గవర్నర్ ద్వారా సమాచారం సేకరించే పనిలో పడిందని అంటున్నారు. గత అయిదేళ్లుగా కెసిఆర్ సచివాయం మొహం చూడలేదు. దీనిని లక్ష్యంగా చేసుకుని కీలక శాఖల మీద కేంద్రం దృష్టి పెట్టె అవకాశం ఉందని అంటున్నారు. ఇవ‌న్నీ అధికార పార్టీ నేత‌ల్లో ఆందోళ‌న‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. ఇక చాలా శాఖల్లో జారి అయిన జీవోలు కూడా వివాదాస్పదంగా ఉన్నాయి వాటి మీద కూడా దృష్టి పెట్టె అవకాశం ఉందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: