తెలంగాణ సీఎం కెసిఆర్ ని విమర్శించే వారిలో చాలా మంది చేసే విమర్శ ఆయన ఒక నియంత అని... వేగంగా నిర్ణయాలు తీసుకోవడమే కాదు.. ఆ నిర్ణయాల విషయంలో ఆయన వెనక్కి తగ్గకపోవడం.. ఎవరు ఎన్ని చెప్పినా సరే తాను తీసుకున్న నిర్ణయం విషయంలో కనీసం ఆలోచించకపోవడం వంటివి చూస్తూ ఉంటారు. ఉద్యమ నేతగా ఎలా ఉన్నారో తెలియదు గాని... ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం కెసిఆర్ వైఖరిలో చాలా వరకు మార్పు వచ్చింది అనే విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. తాను అనుకున్నదే గాని సలహా ఇచ్చే వాడికి దిక్కు లేదు.

 

ఇప్పుడు ఇదే ఇబ్బంది గా మారింది... ఆర్టీసి సమ్మె విషయంలో కెసిఆర్... అనుసరించిన వైఖరిపై అనేక విమర్శలు ఉన్నాయి. అసలు యూనియన్లను ఎందుకు ఆయన టార్గెట్ చేసారో కూడా అర్ధం కాని పరిస్థితి. అసలు యునియన్లను రద్దు చెయ్యాలి అనే ఆలోచనలో కెసిఆర్ ఉన్నారు. దాని ద్వారా... కార్మికులను తన గ్రిప్ లో పెట్టుకునే ఆలోచనలో భాగంగా ఆయన ఇప్పటికే వారితో ఆత్మీయ సమావేశం అంటూ ఒకటి నిర్వహించారు కూడా. 

 

ఇక యునియన్లకు ఎన్నికలు లేవు అని కూడా కెసిఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అసలు అవి రద్దు అయితే... రేపు విపక్షంలో ఉంటే మనతో కలిసి పోరాటం చేసే వాళ్ళు ఎవరు అనే ప్రశ్న తెరాస పార్టీలో ఎక్కువగా వినపడుతుంది. గతంలో ఆర్టీసి ఉద్యోగులు తెలంగాణా ఉద్యమానికి సహకరించారు. ఆ యూనియన్లతోనే ఆయన బంద్ లు ఉద్యమాలు చేసారు. ఇప్పుడు వాళ్ళను కాదని... వద్దని అంటే భవిష్యత్తులో అవసరం అయితే వాళ్ళు వస్తారా అనే ప్రశ్న వినపడుతుంది. 

 

ఇది తెరాస లో చీలికకు కారణం అయిందని చాలా మంది సీనియర్ నేతలు ఈ నిర్ణయం పట్ల ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. ఇప్పటికే నాయిని నరసింహా రెడ్డి తప్పు బట్టారు. ఈటెల రాజేంద్ర, హరీష్ రావు సహా పలువురు సీనియర్లు ఈ నిర్ణయం పట్ల ఆగ్రహంగా ఉన్నారట. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: