కొడుకు నారా లోకేష్ ఎదుగుదల కోసం కోడలు నారా బ్రాహ్మణిని చంద్రబాబునాయుడు తొక్కేస్తున్నారా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.  కోడలు రాజకీయ ప్రవేశంపై చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యల వల్లే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కర్నూలు జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ ’రాజకీయాల్లో లోకేష్ ఫెయిల్ అయినంతమాత్రనా తమ కుటుంబం నుండి ఇంకొకరు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు’ అన్నారు.

 

అలాగే బ్రాహ్మణితో పాటు తన భార్య భువనేశ్వరి కూడా ప్రస్తుతం వ్యాపారంతో పాటు కుటుంబాన్ని చూసుకుంటున్నట్లు చెప్పారు. కాబట్టి బ్రాహ్మణి రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు లేవని చంద్రబాబు స్పష్టం చేశారు.  ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మొన్నటి ఎన్నికల్లోనే గుంటూరు లేకపోతే విజయవాడ పార్లమెంటు నియోజకవకర్గం నుండి బ్రాహ్మిణి పోటి చేస్తుందని పార్టీలోనే విపరీతమైన ప్రచారం జరిగింది.

 

అయితే తెర వెనుక ఏమి జరిగిందో తెలీదు కానీ బ్రాహ్మణి మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. అయితే లోకేష్ తరపున మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ నాలుగు రోజులు ప్రచారం మాత్రం చేశారు. నాలుగు రోజుల ప్రచారానికి లోకేష్ కన్నా బ్రాహ్మణినే బాగా మాట్లాడుతోందని పార్టీ నేతలతో పాటు మామూలు జనాలు కూడా అభిప్రాయనికి వచ్చేశారు.

 

దానికి ముందు అప్పుడప్పుడు మీడియా ముందుకొచ్చిన సందర్భాల్లో కూడా బ్రాహ్మణి మాట్లాడిన తీరు జనాలకు బాగా నచ్చింది. ఇక లోకేష్ గురించి చెప్పాలంటే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.  రాజకీయాలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్, లోకేష్ దాదాపు ఒకటే అని చెప్పచ్చు. ఏ విషయంలో కూడా లోకేష్ కు విషయం పరిజ్ఞానం ఉండదు.

పట్టుమని పది నిముషాలు తప్పులు లేకుండా తెలుగు కూడా మాట్లాడలేడు.  అయినా ఎంఎల్సీ అయిపోయిన మంత్రిగా కూడా పనిచేశారంటే కేవలం చంద్రబాబు కొడుకు అవటం వల్ల మాత్రమే తప్ప మరో అర్హతే లేదు. ఇందుకే అందరూ బ్రాహ్మణి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు.

 

సరే ఈమె వస్తే ఏమైపోతుందన్నది వేరే సంగతి. బ్రాహ్మణి గనుక రాజకీయాల్లోకి అడుగుపెడితే లోకేష్ ను ఎవరూ పట్టించుకోలేరనే భయం చంద్రబాబులో ఉన్నట్లుంది. అందుకనే కోడలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: