ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసారు... జనసేన పార్టీని తెలుగుదేశంలో లేదా బిజెపిలో విలీనం చేస్తారు. ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ పై విమర్శలు చేసే వాళ్ళు చాలా మంది అదే విమర్శ చేసే వాళ్ళు. అసలు చంద్రబాబు ఇచ్చిన డబ్బులతో పెట్టిన పార్టీ అది అంటూ విమర్శలు చేసారు. ఇప్పుడు వాళ్ళు అనుకున్న విధంగానే పరిస్థితులు కనపడుతున్నాయి. రాజకీయంగా పవన్ సామర్ధ్యం ఏంటో ఎన్నికల్లో స్పష్టంగా తెలిసిపోయింది. ఆయన ఎన్నికల్లో ఓటమి తర్వాత... బిజెపిని పొగడటం కూడా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

 

మాట్లాడితే తాను కేంద్రానికి ఫిర్యాదు చేస్తాను అంటూ వ్యాఖ్యానించారు పవన్. ఇప్పుడు అమిత్ షా భక్తుడి అవతారం ఎత్తిన ఆయన తన భక్తులను అయోమయంలో ముంచెత్తారు. తన బలం ఏంటో తెలుసుకోవడానికి గాను విశాఖలో తెలుగుదేశం పార్టీ మద్దతుతో లాంగ్ మార్చ్ అనే కార్యక్రమానికి పవన్ శ్రీకారం చుట్టారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం తిరుగుతూ బిజెపికి దగ్గరగా ఉన్నా వాళ్ళను ప్రత్యేక హోదా కోసమే విభేదించా అంటూ వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టారు. 

 

ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో ఆయన బిజెపిలో విలీనం చేస్తారు అనే స్పష్టత వచ్చింది. ఈ వ్యాఖ్య‌లు ప‌వ‌న్ చేసుకుంటే చేసుకున్నారు అందులో తప్పేమీ లేదు...  తాను పార్టీని నడప లేను అనే అప నమ్మకం ఆయ‌న‌కు వచ్చింది కాబట్టి చేసుకుంటున్నారు. దాని కోసం వైసీపీని తిట్టడం ఎందుకు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. భక్తులకు కథలు అల్లడానికి పర్యటనలు చేస్తూ వాళ్ళను బిజెపి కోసం సిద్దం చేస్తూ రైతులతో సమావేశాలు నిర్వహిస్తూ ప‌వ‌న్ త‌న అభిమానుల‌ను మోసం చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

 

ప‌వ‌న్ త‌న అన్న‌లా పార్టీని వీలీనం చేసుకుంటే ఇన్ని డ్రామాలు ఎందుకు అనే విమర్శలు ఎక్కువగా వినపడుతున్నాయి. రాజకీయం అనేది పవన్ కి గాని ఆయన కుటుంబానికి గాని రాదూ... అలాంటప్పుడు సైలెంట్ దుకాణం కట్టేసి వెళ్ళకుండా ఈ విమర్శలు ఈ హడావుడి ఎందుకు అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: