కీలకమైన విషయంలో జిల్లాలోని మెజారిటి నేతలు చంద్రబాబునాయుడుకు పెద్ద షాకే ఇచ్చారట. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కార్యకర్తల ఆత్మీయ సమావేశం అనే పేరుతో చంద్రబాబు జిల్లాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే  కర్నూలు జిల్లాలో మూడు రోజులు పర్యటించారు. మొన్నటి కడప జిల్లాలో తగిలిన షాకే కర్నూలు జిల్లా పర్యటనలో కూడా తగిలింది చంద్రబాబుకు.

 

ఇక్కడ ప్రధానమైన విషయం ఏమిటంటే ఎన్నికల్లో తగిలిన దెబ్బ నుండి పార్టీ తేరుకోవాలంటే జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సోమిశెట్టిని మార్చాలని చంద్రబాబు అనుకున్నారట. సోమిశెట్టి స్ధానంలో గౌరు వెంకటరెడ్డిని నియమించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. అయితే ఈ నిర్ణయాన్ని జిల్లాలోని మెజారిటి నేతలు వ్యతిరేకించారు.

 

వైసిపి నుండి మొన్నటి ఎన్నికలకు ముందు మాత్రమే పార్టీలోకి వచ్చిన మాజీ ఎంఎల్ఏ గౌరు చరితారెడ్డి భర్త, మాజీ ఎంఎల్సీ గౌరు వెంకటరెడ్డిని జిల్లా అధ్యక్షుడిని ఎలా చేస్తారంటూ ప్రశ్నించారని సమాచారం. చంద్రబాబు నిర్ణయాన్ని మెజారిటి నేతలు తీవ్రంగా వ్యతిరేకించారట.

 

అధ్యక్షుని మార్పు విషయంలో నేతల నుండి ఎదురైన వ్యతిరేకతతో చంద్రబాబు షాక్ తిన్నారు. తర్వాత ఏం చేయాలో అర్ధంకాక నేతలనే చెప్పమని అడిగారట. దాంతో సోమిశెట్టినే కంటిన్యు చేయమని చాలమంది సలహా ఇచ్చారట. అయితే సోమిశెట్టిని కంటిన్యు చేయటం చంద్రబాబుకు ఇష్టం లేదని పార్టీ నేతలు అంటున్నారు.

 

ఈ విషయం బయటపడటంతోనే సమీక్షా సమావేశంలోనే పెద్ద గొడవైంది. గౌరు ముఖ్య అనుచరుడు కర్నూలు జిల్లా సహకార సంఘం మాజీ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డికి సోమిశెట్టికి చంద్రబాబు సమక్షంలోనే పెద్ద గొడవైంది. ఇద్దరు కొట్టేసుకుంటారా అన్నంత స్ధాయిలో గొడవపడ్డారు. మెజారిటి నేతలు తనను వ్యతిరేకించిన విషయం తెలియగానే గౌరే తన మద్దతుదారుడితో సోమిశెట్టిని టార్గెట్ చేసుకున్నాడని నేతలు అనుమానిస్తున్నారు. మొత్తం మీద జిల్లా నేతలపై తన నిర్ణయాన్ని రుద్దాలని చంద్రబాబు చేసిన ప్రయత్నం ఫలించకపోవటంతో షాక్ కు గురై చేసేది లేక వెనక్కు తిరిగారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: