విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం....తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ టీడీపీ మంచి విజయాలే సాధించింది. 1983,85,89, 1994, 99 ఎన్నికల్లో వరుసగా గెలిచింది. అయితే 2004, 2009లో ఓడిపోయింది. ఇక 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు దాదాపు 37 వేల మెజారిటీతో గెలిచారు. అయితే 2019 ఎన్నికలోచ్చేసరికి రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక్కడ గంటా మీద వ్యతిరేకిత రావడంతో అధినేత చంద్రబాబు ఆయనని విశాఖ తూర్పు బరిలో నిలిపారు.

 

ఇటు భీమిలికి వచ్చేసరికి మాజీ ఎంపీ సబ్బం హరిని పోటీ చేయించారు. అయితే అప్పటికప్పుడు పోటీ చేయడంతో సబ్బం...వైసీపీ అభ్యర్ధి అవంతి శ్రీనివాస్ చేతిలో 9712 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక ఓటమి పాలైన దగ్గర నుంచి సబ్బం హరి యాక్టివ్ గా ఉండటం లేదు. దీంతో భీమిలిలో టీడీపీని నడిపించే నాయకుడు కరువయ్యాడు. కాగా, సబ్బం హరి 2009లో కాంగ్రెస్ తరుపున అనకాపల్లి ఎంపీగా గెలిచారు. ఇక ఆ తర్వాత వైఎస్ మరణం, జగన్ కొత్త పార్టీ పెట్టడంతో అటు వైపు వెళ్లారు.

 

కానీ అధినేత జగన్ తీరుతో ఆయన వైసీపీని వదిలేసి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన సమైక్యాంధ్ర పార్టీ తరుపున 2014లో విశాఖపట్నం ఎంపీగా దిగారు. కానీ వైసీపీని ఓడించాలనే లక్ష్యంతో అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుని బీజేపీ-టీడీపీలకు మద్దతు తెలిపారు. ఆ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో... అప్పటి నుంచి ఆయన టీడీపీకి పాజిటివ్ మాట్లాడుతున్నారు తప్ప. ఎప్పుడు ఆ పార్టీలో చేరలేదు. 

 

అయితే ఎన్నికల సమయంలో హఠాత్తుగా సబ్బంని పిలిచి చంద్రబాబు భీమిలి టికెట్ ఇచ్చారు. ఉన్నపళంగా బీఫామ్ ఇవ్వడంతో సబ్బం పోటీకి దిగి ఓటమి పాలయ్యారు. ఇటు రాష్ట్రంలో కూడా టీడీపీ ఓడిపోవడంతో ఆయన సైలెంట్ అయిపోయారు. నియోజకవర్గంలో టీడీపీని వదిలేశారు. దీంతో అక్కడ టీడీపీ కేడర్ ని ముందుండి నడిపించే నాయకుడు కరువైపోయాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: