చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది.  బహిరంగసభల్లోను, కార్యకర్తల సమావేశాల్లోను, ట్విట్టర్ లోను పవన్ చేస్తున్న వ్యాఖ్యలు చాలా విచిత్రంగానే కాకుండా చవకబారుగా ఉంటున్నాయి. తాజాగా దిశ హత్యాచారం నిందుతుల విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయపార్టీలతో పాటు మహిళలు, యువత వర్గాలు మండిపోతున్నాయి.

 

దిశ హత్యాచారం నిందుతులకు ఉరిశిక్ష వేయాలని దేశంలోని అన్నీ వర్గాలు మండిపడుతుంటే పవన్ మాత్రం వాళ్ళకు ఉరిశిక్ష వేయాల్సిన అవసరం లేదన్నారు. వాళ్ళను బెత్తం తీసుకుని చెమడాలు ఊడిపోయేట్లు కొడితే చాలని చేసిన వ్యాఖ్యలపై యువత, మహిళలు తీవ్రంగా స్పందిస్తున్నారు. కొందరైతే పవన్ మానసిక పరిస్ధితి సరిగా లేదని కూడా అనుమానిస్తున్నారు.

 

పవన్ ఎక్కడ మాట్లాడినా ఏం మాట్లాడినా జగన్మోహన్ రెడ్డిని తిట్టటమే టార్గెట్ గా పెట్టుకున్న విషయం అర్ధమైపోతోంది. తెలంగాణాలో దిశపై హత్యాచారం జరిగితే జగన్ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. 2017 లో ఓ అమ్మాయిని రేప్ చేసి హత్య చేసిన కేసును జగన్ ఎందుకు తొక్కిపెడుతున్నాడంటూ నిలదీస్తున్నారు.

 

చంద్రబాబుకు పవన్ మద్దతు ఇవ్వదలచుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ చంద్రబాబు మనిషిగా సంబంధం లేని ప్రతి విషయాన్ని జగన్ కు ముడేసి ఆరోపణలు చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. రోజు రోజుకు పవన్ మాట్లాడుతున్న మాటల్లో ఉన్మాదస్ధితే కనిపిస్తోంది. కేవలం అభిమానులకు మాత్రం పవన్ మాటలు నచ్చితే నచ్చచ్చు.

 

సినిమా రంగం విషయంలో కూడా పవన్ నోటికొచ్చినట్లు మాట్లాడారు. దాంతో సినిమా రంగంలోని సీనియర్లు కూడా మండిపోతున్నారు. ఇటు వైసిపి నేతలు ఎప్పటి నుండో పవన్ వైఖరిని తప్పుపడుతున్నారు.  జగన్ పై ఆరోపణలు చేయటంలో తప్పేమీలేదు. కానీ చేసే ఆరోపణల్లో పసుండాలి. ప్రభుత్వం చేస్తున్న తప్పొప్పులను ఎత్తి చూపాల్సిందే. కానీ బుర్రనిండా ధ్వేషం నింపుకుని మాట్లాడిన ప్రతి మాటకు పెడర్ధాలు తీసి మరీ విమర్శలు చేయటాన్ని మామూలు జనాలు కూడా హర్షించటం లేదు. పనవ్ తన పద్దతి మార్చుకోకపోతే  మొన్న చంద్రబాబునాయుడుకు జరిగినట్లే పవన్ కు కూడా సత్కారం తప్పదేమో అనే అనుమానంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: