కర్నూలు జిల్లా వైసీపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో భూములు కొని రాజధానిని ప్రకటించారని అన్నారు. చంద్రబాబు చేసిన మోసాలతో శఠగోపం అనే సినిమా తీయొచ్చని చెప్పారు. రాజధాని విషయంలో ఆమోదయోగ్యమైన ఫలితం వస్తుందని చెప్పారు. త్వరలో వాస్తవాలు బయటకు రాబోతున్నాయని బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. రాజధాని నిర్మాణానికి 1500 ఎకరాలు సరిపోతాయని బుగ్గన చెప్పారు. 
 
దళితుల నుండి అసైన్డ్ భూములు లాక్కున్నారని బుగ్గన చెప్పారు. బినామీల పేర్లతో పత్తిపాటి పుల్లారావు, వేములపాటి వంటి వారు భూములు కొన్నారని బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. చంద్రబాబునాయుడు సంస్థ హెరిటేజ్ 14 ఎకరాలు, పరిటాల సునీత, జీవీ ఆంజనేయులు, పయ్యావుల కేశవ్, లింగమనేని రమేశ్, ధూళిపాళ్ల నరేంద్ర , కంభంపాటి రామ్మోహనరావు, యనమల వియ్యంకుడు కొమ్మలపాటి శ్రీధర్ డైరెక్ట్ గా భూములను కొన్నారని అన్నారు. 
 
వీళ్లు నూజివీడు అని, వేరే చోట అని చెప్పి రాజధానిని ప్రకటించక ముందే భూములను కొన్నారని చెప్పారు. ఇన్ సైడ్ ట్రేడ్ జరిగిందని బుగ్గన అన్నారు. బినామీ పేర్లతో పత్తిపాటి పుల్లారావు గారు, కొమ్మలపాటి శ్రీధర్ గారు, వేమూరి రవికుమార్ (నారా లోకేశ్ అసోసియేట్), మురళీమోహన్ అకౌంటెంట్లు, డ్రైవర్ల పేర్లతో భూములు కొన్నారని చెప్పారు. అమాయకులైన రైతులను మోసం చేసి రాజధాని అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. 
 
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ రాజధానిని నోటిఫై చేయకుండా పడుకుందా...? అని బుగ్గన ప్రశ్నించారు. రాజధాని నిర్మాణంలో అనేక అవకతవకలు జరిగాయని చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రం బలయిందని చెప్పారు. శివరామ కృష్ణన్ కమిటీ నివేదికను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదని బుగ్గన రాజేంద్రనాథ్ గుర్తు చేశారు. బుగ్గన రాజేంద్రనాథ్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. బుగ్గన చేసిన బినామీ ఆస్తుల గురించి ఏం సమాధానం చెబుతారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: