వివాహం ముందే శృంగారం చేసిన ఒక ఇండోనేషియా వ్యక్తిని బహిరంగంగా శిక్షిస్తూ... కొరడా దెబ్బలు కొట్టడంతో అతడు స్పృహ తప్పి పడిపోయాడు. అయితే... ఆ శిక్షను విధించే అధికారులు... దోషిని స్పృహలోకి వచ్చేట్లు చేసి... ఆ తర్వాత మిగతా శిక్షను కూడా విధించారు.

వివరాల్లోకి వెళితే... ఇండోనేషియాలోని అకెహ్ ప్రాంతంలో కఠినమైన ఇస్లామిక్ షరియా చట్టాలు విధించబడతాయి. అయితే... వీటిలో బెత్తంతో కొట్టడం లేకపోతే కొరడాతొ కొట్టే శిక్షలు ఎవరికి విధిస్తారంటే... గే సెక్స్ చేసే వారికి, జూదం ఆడేవారికి, పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొనే వారికి. అయితే అక్కడి చట్టాలు ఎలా ఉంటాయంటే... ఎంత పెద్ద అధికారులు తప్పు చేసినా వారికి మాత్రం కొరడా దెబ్బల శిక్ష తప్పనిసరి. బహిరంగ శిక్షను అమలు చేసేప్పుడు 100 మంది ప్రేక్షకులు శిక్ష విధించే చోటుకు వచ్చి.. దోషులను అసహ్యంగా చూస్తూ... గట్టిగా కొట్టిండి.. బాగా కొట్టండని అరుస్తుంటారు.

అయితే గురువారం రోజు... 22 ఏళ్ల పెళ్లికాని ఒక యువకుడు... ఒక మహిళతో శృంగారంలో పాల్గొన్నాడు. ఈ విషయం కాస్త అక్కడి అధికారులకి తెలిసిపోయింది... దీంతో... వెంటనే అతనికి వంద బహిరంగ కొరడా దెబ్బల శిక్షను అమలు చేసారు. అయితే కొన్ని దెబ్బలు కొట్టగానే అతడు స్పృహ తప్పి కిందపడిపోయాడు.. కొన్ని క్షణాల్లోనే అతడికి మెడికల్ చికిత్సను అందించి స్పృహ తెప్పించారు. ఆపై మళ్లీ శిక్షణను కొనసాగించారు. దాంతో ఆ సదరు యువకుడికు తీవ్ర గాయాలై స్పృహతప్పి కిందపడిపోయాడు. దాంతో అతడి సత్వర చికిత్స కోసం దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి తరలించారు.

అతనితో సెక్స్ చేసిన మహిళలు కూడా పట్టుకుని ఒక మసీదు ముందు మోకాళ్ళపై కూర్చోబెట్టి... ఆమెకు కూడా వంద కొరడా దెబ్బలు శిక్షగా విధించారు. ఇటువంటి బహిరంగ శిక్షలను తొలగించాలంటూ ప్రపంచ వ్యాప్తంగా ఖండిస్తున్నా అకెహ్ ప్రాంత పెద్దలు మాత్రం ఎప్పటిలాగానే వాళ్ళ శిక్షలను అమలు చేస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: