జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటనలో చేస్తున్న వ్యాఖ్యలు ఏపీలో అధికార పార్టీ వైసీపీని ఊకిరి బిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్ ని టార్గెట్ చేసుకుని పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు ఏపీలో ఆసక్తికరంగా మారాయి. రాయలసీమలో ఉన్న ప్రజలను అనగా తొక్కుతూ ఇక్కడ ఉన్న రాజకీయ నేతలు రాజకీయాలు నడిపిస్తున్నారని పవన్కళ్యాణ్ మండిపడ్డారు. ఇటువంటి నేపథ్యంలో చిత్తూరు జిల్లా పర్యటనలో మదనపల్లెలో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నాలాంటి వాడు రోడ్డు మీదకు వస్తే ఆర్మీ కూడా ఆపలేదని షాకింగ్ కామెంట్లు చేశారు. మదనపల్లె లో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు డబ్బుపై వ్యామోహం లేదని అన్నారు.

 

జానీ సినిమాలో వచ్చిన రెండు కోట్లతో మాదపూర్ లో 30 ఎకరాల భూమి కొని ఉంటే వేల కోట్లు వచ్చి ఉండేదని ఆయన అన్నారు.తాను మంగళగిరి సభలోనే టిడిపి,బిజెపిలతో విబేదించానని ఆయన చెప్పారు. అయినా తనపై వైసిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.డబ్బు ఎక్కువుంటే పోరాడే శక్తి తగ్గిపోతుందనే కూడబెట్టలేదన్నారు. వ్యాపారాలు లేని రాజకీయ నేతలు మాత్రమే ఆదర్శనీయులు అవుతారని చెప్పారు.

 

వైకాపా నేతల చీకటి వ్యవహారాలు తనకు తెలుసని, ఆ పార్టీ బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదన్నారు.తనకు బిడ్డల మీద మమకారం లేదు.. జీవితం మీద ఇష్టం లేదు. సమాజం కోసం ఎక్కడికైనా వస్తానని ఆయన చెప్పారు. సనాతన సంప్రదాయాలపై చచ్చేంత మమకారం ఉందని, తాను రోడ్డుపైకి వస్తే మీ ఆర్మీలు ఎందుకూ పనికిరావని ఆయన అన్నారు. అధికారంలో ఉన్న వైసిపి పార్టీ నేతలపై మరియు అదే విధంగా రాయలసీమలో ఉన్న రైతులకు సంబంధించిన సమస్యలపై పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో కీలక వ్యాఖ్యలు చేశారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: