జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల రాయలసీమ పర్యటనలో కేవలం హిందువుల రాజకీయ నేతల వల్ల దేశంలో మతాల గొడవలు జరుగుతున్నాయి అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటివరకు వేరే మతాలకు చెందిన నాయకులు ఎవరు కూడా మత గొడవలు సృష్టించలేదని కేవలం హిందూ భావజాలం కలిగిన రాజకీయ నేతలు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి మత రాజకీయాలను తమకు అనుకూలంగా మార్చుకుంటారు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్..జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా జీవిఎల్ మాట్లాడుతూ...జనసేన పార్టీ విలీన ప్రతిపాదనతో వస్తే తప్పకుండ ఆహ్వానిస్తామని బిజెపిలో ఎవరు కాదన్నారు అని పైగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు పార్టీలోకి వస్తానంటే సాదరంగా ఆహ్వానిస్తాం అంటూ జీవిఎల్ పేర్కొన్నారు.

 

పవన్ కళ్యాణ్ ని 2019 ఎన్నికల ముందే జనసేన పార్టీని బిజెపి పార్టీలో విలీనం చేయాలని కోరామని కానీ ఆయన అప్పుడు తిరస్కరించారని జివిఎల్ పేర్కొన్నారు. అయితే ఎప్పటికైనా సమయం మించిపోలేదు అని పవన్ కళ్యాణ్ కి ఇష్టమైతే జనసేన పార్టీ బీజేపీ లో విలీనం చేయవచ్చు అంటూ...జీవిఎల్ మాట్లాడుతూ బీజేపీ పార్టీలో స్థానిక నాయకులు ఎవరైనా పని చేయాలనుకుంటే వారికి ఎవరు అడ్డు రారు అని జీవిఎల్ పేర్కొన్నారు. ఇదే సమయంలో రాయలసీమ పర్యటనలో హిందూ నాయకులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను జీవిఎల్ తీవ్రస్థాయిలో ఖండించారు.

 

కేవలం హిందువుల వల్లే గొడవలు జరుగుతున్నాయని చెప్పడం దారుణమని వెల్లడించారు. కాగా ఈ వాఖ్యలని పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకోని, అందరికి క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ కోరారు. మరోపక్క పవన్ కళ్యాణ్ ఇటువంటి ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన మత రాజకీయాలను చేస్తూ బీజేపీ లో చేరటానికి ఆంధ్రాలో ప్రజల మధ్య ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో విభేదాలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు మరోపక్క పవన్ కళ్యాణ్ ని వ్యతిరేకించే వివిధ పార్టీల నేతలు కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: