కేంద్రంలో పరిస్థితులు రోజుకో విధంగా మారిపోతున్నాయి. 2019 దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్టీ 2014 ఎన్నికల కంటే భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం జరిగింది. అయితే మెల్లమెల్లగా దేశంలో పరిస్థితులు మారుతున్న క్రమంలో మహారాష్ట్రలో బిజెపి పార్టీ ప్రభుత్వం మొదట ఎన్నికల తరువాత ప్రభుత్వం స్థాపించిన తరువాత కూలిపోవడం జరిగింది. ఇదే క్రమంలో దేశంలో బీజేపీ పార్టీ ఏదో విధంగా దేశాన్ని మొత్తం గుప్పెట్లో పెట్టుకునే విధంగా రాజకీయాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో దక్షిణాదిలో ఉన్న ప్రాంతీయ పార్టీలు మరియు అదే విధంగా ఇతర పార్టీలు బిజెపి పార్టీకి మనుగడ లేకుండా బిజెపి పార్టీ ని ఎదుర్కోవటానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.

 

ఈ క్రమంలో ముందుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనదైన శైలిలో రాజకీయాలు చేస్తుండగా తర్వాత స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా బిజెపి పార్టీకి వ్యతిరేకంగా తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ ఢిల్లీలో పరిపాలనను కొనసాగిస్తున్నారు. 2015 ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఊహించనివిధంగా ఢిల్లీలో ప్రభుత్వం స్థాపించడంతో 2020 ఎన్నికలలో అదే స్థాయిలో విజయం సాధించాలని ఇప్పటి నుండే ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని రకాలుగా రెడీ అవుతుంది. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీ వాసులకు ఎక్కడ ఉన్న వారికి ఫ్రీ వైఫై ఇవ్వడానికి కేజ్రీవాల్ ప్రభుత్వం రెడీ అయింది. ఢిల్లీ వాసులు ఎక్కడ ఉన్నా ఎక్కడికి వెళ్ళినా ఢిల్లీలో వారికి ఫ్రీ ఇంటర్ నెట్ వైఫై సదుపాయం అందుబాటులోకి ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తీసుకు వచ్చింది.

 

ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి తాజాగా ఈసదుపాయాన్ని ప్రారంబించారు. దీని ద్వారా డిల్లీలోని పదకుండువేల స్పాట్స్ లో ఇంటర్ నెట్ వైఫై సదుపాయాన్ని పౌరులు వాడుకోవచ్చు. ఈ సందర్బంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ ప్రస్తుతం ఇంటర్ నెట్ అన్నది అందరికి అవసరమైన విషయంగా మారిపోయిందని, అందువల్ల పౌరులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. తాము గత ఎన్నికల మానిపెస్టోలో దీనిపై హామీ ఇచ్చామని, ఇప్పుడు నెరవేర్చామని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. తాజాగా అరవింద్ కేజ్రీవాల్ వేసిన ఎత్తుగడతో రాబోయే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా లాభం చేకూరుతుందని గ్యారెంటీ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం అయింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: