రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న పర్యటన మరియు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా రాప్తాడు ప్రాంతం జనసేన పార్టీకి చెందిన నాయకుడు సాకే మురళి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ మీడియాలో మరియు సోషల్ మీడియాలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో అధికార పార్టీకి చెందిన నాయకుల వేధింపులు ఎక్కువయ్యాయని జనసేన పార్టీ నాయకుల పట్ల కార్యకర్తల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని సాకే మురళి సమావేశంలో పేర్కొన్నారు. ముఖ్యంగా వైసీపీ పార్టీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రకాశ్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోయారు. పవన్ ఆదేశిస్తే ఒక్క ప్రకాశ్ రెడ్డి తల కాదు.. ఏ రెడ్డి తలనైనా నరికి తీసుకొస్తా అని సాకే మురళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 

దీంతో పవన్ కళ్యాణ్ సాకే మురళి చేసిన వివాదాస్పద కామెంట్లో పట్ల స్పందిస్తూ సమర్పించారు. ఎంతో ఆవేదన ఉంటే గాని ఆ విధంగా మాట్లాడలేరని కాబట్టే మురళి ఆ మాట అన్నారని పవన్ చెప్పారు. వైసీపీ నేతలు ఎన్నోసార్లు రాప్తాడు మురళిని బెదిరించారని పవన్ వాపోయారు. మాజీ సీఎం చంద్రబాబుని ఉరి తీయాలని జగన్ అన్నారని గుర్తు చేసిన పవన్.. నాడు జగన్ పై ఏ కేసు పెట్టారో ఇప్పుడు సాకే మురళి పైనా అదే కేసు పెట్టాలన్నారు. అయితే మరోపక్క చాలా సామరస్య వాతావరణంలో నేను రాజకీయాలు చేస్తాను నా భాష శైలి కూడా ఎవరినీ నొప్పించే విధంగా ఉండవు అంటూ అప్పట్లో కల్లబొల్లి కబుర్లు ఇప్పుడు కావాలని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి పవన్ కళ్యాణ్ తాను మరియు తనతోపాటు జనసేన పార్టీకి చెందిన నాయకులను ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఇష్టానుసారంగా మాట్లాడించే విధంగా స్క్రిప్టు రెడీ చేస్తున్నారని జనం ఇదంతా గమనిస్తున్నారని వైసీపీ పార్టీకి చెందిన నాయకులు సాకే మురళి చేసిన వ్యాఖ్యలను సమర్థించిన పవన్ కళ్యాణ్ పై విమర్శల వర్షం కురిపించారు.

 

ఇటువంటి వ్యక్తి రెండు లక్షల పుస్తకాలు చదివాను దేశం అంటే నాకు ఎంతో ప్రేమ అన్ని కల్లబొల్లి కబుర్లు చెబుతూ పైకి కటింగ్ ఇస్తూ రాజకీయాల్లో ఇంకా నటిస్తున్నాడు అంటూ ప్రజలు పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ఏమాత్రం వినటం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వారని తగిన సమయంలో 2019 ఎన్నికల్లో బుద్ధి ఎలా చెప్పటం జరిగిందో అదేవిధంగా పవన్ కళ్యాణ్ కి భవిష్యత్తులో బుద్ధి చెప్పడం ఖాయమని వైసిపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: