వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. చేసే ఆలోచనలు సరిగ్గా ఉంటే అన్ని సక్రమంగా ఉంటాయి అంటారు. ఈ విషయం మితిమీరిన శృంగారానికి అచ్చుగుద్దినట్లుగా కనిపిస్తుంది. ఇకపోతే రోజుకు పది మందితో రొమాన్స్ చేసే వ్యక్తులను ‘ప్లే బాయ్స్’ అంటారనే సంగతి తెలిసిందే. ఇదే పనిని జంతువులు, పక్షులు చేస్తే. ఏమంటారో డిక్షనరీ వెతుక్కోవలసిందే.

 

 

ఇకపోతే ఇక్కడొక బాతూ ఏకధాటిగా అదేపని చేస్తుందంటా అందుకే దీనికి ‘ప్లే డక్’ అనే పేరుతో పిలుస్తున్నారు.. ఎందు కంటే ఈ బాతుకు సెక్స్ పిచ్చి ఎక్కువగా ఉందట. ఎంతపిచ్చి అంటే కనీసం రోజుకు 10 ఆడ బాతులతో సెక్స్ చేస్తేగానీ దానికి నిద్రపట్టదట. రోజంతా ఇదే పనిలో ఉండటం వల్ల పాపం దాని అంగానికి గాయమై అది పెద్దది కావడంతో చివరికి దాన్ని కోల్పోవల్సి వచ్చిందట. ముక్కున వేలెసుకునే ఈ ఘటన జరిగింది ఎక్కడంటే యూకేలో..

 

 

అయితే ర్యాండీ డావే అనే ఓ మగ బాతు, ఆడ బాతులతో ఎప్పుడు అదేపనిని కానిస్తుండేదట. కానీ ఇక్కడొక ట్విస్ట్ ఉంది. అదేమంటే  ఏ బాతుతో పడితే ఆ బాతుతో పిచ్చి తిరుగుళ్లు తిరిగేది కాదట. ఇందుకు గాను ఓ ముగ్గురుని సెట్ చేసుకుందట. ఉదయాన్నే చెరువు గట్టు దగ్గర కలిసే తన ఫ్రెండ్స్ డోరా, ఫ్రెడా, ఎడిత్‌లతో మాత్రమే అది సెక్స్ చేసేదట. ఈ విషయాన్ని యూకేలోని బ్రిస్టాల్‌కు చెందిన ‘హై‌క్రాఫ్ట్ ర్యాబిట్, స్మాల్ మమ్మల్ & ఎగ్జోటిక్ వెట్స్’ అనే సంస్థ ఇటీవల ఓ ఫేస్‌బుక్ పోస్టు పెట్టిందట.

 

 

ఇలాంటి బాతు ఈ మద్యకాలంలో చాలా బుద్దిగా ఉండటం చూసిన దాని యజమాని ర్యాండీ శరీరాన్ని పరిశీలించగా అంగానికి గాయం ఉండటంతో యానిమల్ కేర్ ఆస్పత్రి వద్దకు తీసుకెళ్లాడట. దాన్ని పరీక్షించిన వైద్యులు.. ఇన్ఫెక్షన్ వల్ల దాని అంగం పాడైందని, రోజు అదే పనిగా సెక్స్ చేయడం వల్ల అంగం దెబ్బతిందని తెలి చివరికి సర్జరీ చేసి అంగాన్ని తొలగించారట.

 

 

ఇకపోతే సాధారణంగా బాతులు ఒక్క సీజన్‌లో మాత్రం సెక్స్‌లో పాల్గొంటాయి. కానీ, ర్యాండీ సీజన్‌తో పనిలేకుండా అదే పనిలో ఉండేది. ఫలితంగా ఈ సమస్య వచ్చిందని తెలిపారు. దీనిబట్టి ఏం అర్ధం అవుతుందంటే అతి అనేది మనుషులకైనా , జంతువులకైనా, పక్షులకైనా మంచిది కాదనేది తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: