ఇన్నాళ్లుగా మాటలతోనే కాలం గడిపే పోలీసులను చూసారు. ఇకనుండి చేతల్లో దమ్ము చూపించే కొత్త రక్షక భటులు కనిపిస్తారంటున్నారు ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు. ఇంతకు ఏం జరిగిందంటే. మొన్న జరిగిన దిశ సంఘటన తర్వాత నగరంలో ఏ ఆపద వచ్చిన 100 నంబర్‌కు కాల్ చేయమంటూ పోలీస్ అధికారులు నమ్మకంగా చెప్పారు కదా. ఈ మాటలు విన్న వారు కొందరు ఆ 100 కు ఫోన్ చేస్తే ఏం జరుగుంది నా బొంద అని విమర్శించారు. కాని ఆ 100 నే ఓ మనిషిని బొందపెట్టకుండా కాడింది.

 

 

ఇదిగో ఏం జరిగిందో చూడండి.. సికింద్రాబాద్‌లో నివాసం ఉంటున్న మహమ్మద్ బేగం, ఆమె భర్త కొంత కాలంగా ఘర్షణ పడుతున్నారు. పరస్పరం వాగ్వివాదాలకు దిగుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఈ దంపతుల మధ్య గొడవ ముదిరి తీవ్ర ఘర్షణకు దారి తీసింది. దీంతో మహమ్మద్ బేగం భర్త ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి తలుపులు మూసుకొని ఫ్యాన్‌కు ఉరి వేసుకోని ఆత్మహత్యాయత్నం చేశాడు. అది గమనించిన బేగం.. వెంటనే డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో చిలకలగూడ పోలీసులు బేగం సమాచారంతో కేవలం 3 నిమిషాల్లోనే ఘటనా స్థలికి చేరుకున్నారు.

 

 

తలుపులు పగలగొట్టి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న బేగం భర్తను వెంటనే కిందకు దించి చికిత్స నిమిత్తం అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు బాధితుడిని పరిశీలించిన అతడికి ప్రమాదమేమీ లేదని తెలిపి, ప్రాథమిక చికిత్స అందించి తిరిగి పంపించేశారు. ఆ తర్వాత ఆ దంపతులిద్దరికీ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించేశారు.

 

 

ఇకపోతే ఘటనపై తక్షణమే స్పందించి బాధితుడిని రక్షించిన కానిస్టేబుల్ కిరణ్, డ్రైవర్ బాలాజీని చిలకలగూడ ఎస్‌ఐ అభినందించారు. ఇకపోతే ఇలాంటి సంఘటనలు ఎన్నోచోట్ల జరుగుతున్నాయి కాబట్టి అన్ని చోట్లా పోలీసులు ఇదే విధంగా స్పందించి సకాలంలో బాధితులను రక్షించ గలిగితే కనిపించని నాలుగో సింహం పోలీస్ అనే నమ్మకం ప్రజల్లో కలుగుతుందంటున్నారు కొందరు వ్యక్తులు..

మరింత సమాచారం తెలుసుకోండి: