ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి పై తెలుగుదేశం పార్టీ అద్వర్యం లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం లో చేసిన విమర్శలను  మంత్రులు , వైకాపా నేతలు  ధీటుగా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు . అమరావతి లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి , ప్రభుత్వ విచారణ లో నిజాలన్నీ వెలుగులోకి వస్తాయని చెప్పారు  . అమరావతి ప్రాంతం లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు చెందిన హెరిటేజ్ కంపెనీ కి భూములు ఉన్నాయని తెలిపారు.

 

 అలాగే పలువురు టీడీపీ నేతలకు భూములున్నాయన్న అయన,  పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ , జీవీ ఆంజనేయులు , యనమల వియ్యంకుడికి రాజధాని ప్రాంతం లో భూములు ఉన్నాయని పేర్కొన్నారు.  రాజధాని ప్రాంతం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారో ముందే తెలియడం వల్లే టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారన్నారు . వైకాపా ప్రభుత్వం పై  బురద చల్లేందుకే టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిందని ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు . అధికారం లో ఉండగా ఏనాడూ అఖిలపక్ష సమావేశం నిర్వహించని చంద్రబాబు , ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు .

 

 టీడీపీ అద్వర్యం లో నిర్వహించిన  రౌండ్ టేబుల్ సమావేశం లో సిపిఐ , జనసేన, లోక్ సత్తా , ఆమ్ ఆద్మీ , రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు . రౌండ్ టేబుల్ సమావేశం లో పాల్గొన్న ప్రతినిధులు అమరావతి లో రాజధాని నిర్మించాలని డిమాండ్ చేశారు . రాజధాని ఇక్కడే నిర్మిస్తామని ప్రభుత్వం స్పష్టం చేయాలని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు . రాజధాని నిర్మాణానికి , అభివృద్హి కి జనసేన ఏనాడూ వ్యతిరేకం కాదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ తెలిపారు . టీడీపీ హయాం లో రాజధాని అభివృద్ధి జరిగితే , వైకాపా అధికారం లోకి వచ్చిన తరువాత ఉపాధివకాశాలు దెబ్బతిన్నాయని అన్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: