దిశ.. నిందితులకు అంత తేలిగ్గా లొంగిపోలేదనే విషయాలు వెలుగుచూస్తున్నాయి. తనపై హత్యాచారం చేస్తారని కూడా ముందే అనుమానించినట్టు తెలుస్తోంది.  వాళ్లను ఎదిరించే ధైర్యం చేసి ఓడిపోయిందని నిందితుల తొలిరోజు కస్టడీలో తెలిసినట్టు సమాచారం. పోలీసులు మొత్తం క్రైమ్ సీన్ ను రీ కన్ స్ట్రక్ట్ చేశారు. 

 

దిశ కేసు విచారణలో అసలు కథ మొదలైంది. జైలు నుండి నిందితులను కస్టడీకి తీసుకున్న పోలీసులు నేరుగా నేరాలు జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లారు. అర్దరాత్రి జైలు నుంచి నిందితును తీసుకెళ్లిన ప్రత్యేక బృందాలు.. మొదటగా శంషాబాద్ లోని టోల్ గేట్ దగ్గర దర్యాప్తు చేశాయి.  గత నెల 27 సాయంత్రం మహ్మద్ ఆరీఫ్‌, చెన్నకేశవులు, నవీన్, శివ అక్కడికి  వచ్చాక.. ఏం చేశారాన్నదానిపై సీన్ టు సీన్ రీకన్సట్రక్షన్ చేయించారు. ఆరోజు సాయంత్రం ఐదున్నర నుండి దిశ అక్కడికి వచ్చాక.. ఏం చేశారన్నది పోలీసులకు పూసగుచ్చినట్టు వివరించారు నలుగురు నిందితులు.

 

ఆ నలుగురు దిశను ఎలా అక్కడున్న కాంపౌండ్ వాల్ లోపలికి లాక్కెళ్లారు? అక్కడి నుంచి లారీలోకి ఆమెను ఎలా తరలించారు? అక్కడినుండి లారీలో ఎలా బయలుదేరి తగలబెట్టిన ప్రాంతానికి బయలు దేరారు? మధ్య లో పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొనుగోలు చేసిన ఘటన వరకు... అన్ని విషయాలను పోలీసులకు వివరించారు  నిందితులు.  ఇక చటాన్ పల్లిలో దిశను తగలబెట్టిన ప్రాంతంలోకి ఎలా వెళ్లారన్నది కూడా నిందితులతో సీన్ రీకన్ స్ట్రక్షన్ చేయించారు పోలీసులు. 

 

నిందితులు ఉపయోగించిన లారీలో క్లూస్ టీమ్ తనిఖీలు చేసింది. లారీ క్యాబిన్ నుంచి దశ తల వెంట్రుకలు, బ్లడ్ శాంపుల్ ని క్లూస్ టీమ్ సేకరించినట్టు తెలుస్తోంది. అటు దిశ కూడా తనపై అఘాయిత్యం జరుగుతుందని ముందుగానే అనుమానించినట్టు తెలుస్తోంది. నిందితుల్ని ప్రతిఘటించినట్టు కూడా వాళ్లు చెప్పినట్టు సమాచారం. తొలిరోజు కస్టడీలోనే కీలక విషయాలు వెలుగుచూస్తున్న తరుణంలో.. మిగతా ఆరు రోజుల విచారణ పూర్తయ్యాక.. మరింత సమాచారం బయటికొస్తుందని భావిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: