దేశంలో ప్రతి పదినిమిషాలు ఒక నేరం జరుగుతున్నది.  ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎన్ని ఎంత నిఘా పెంచినా ఎక్కడో ఒక చోట నేరాలు ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి.  వెలుగులోకి వస్తున్నది పది పదిహేను ఉంటె వెలుగులోకి రాకుండా కాంప్రమైజ్ చేసుకుంటున్నవి వేలు లక్షలు ఉన్నాయి. నేరం జరిగిన తరువాత దానిని పోలీసులు టేకప్ చేసిన తరువాత దర్యాప్తు చేయడానికి ఎన్నో రోజులు పడుతున్నది.  నిందితులను పట్టుకున్నా.. దానికి తగిలిన సాక్ష్యాధారాలతో నిరూపించాలి అంటే అంతయీజీ కాదు.  


నేరం చేసిన వ్యక్తి ఫలానా అని అందరికి తెలుసు.  కోర్టుకు కూడా తెలుసు.  కానీ. కోర్టుకు కావాల్సింది అధరాలు.  ఆ అధరాలు లేకుంటే ఎవరూ ఏమి చేయలేరు.  సాక్ష్యాధారాలు ఉంటె తప్పించి మరో యాక్షన్ తీసుకోలేరు.  అలా సాక్ష్యాధారాలు కావాలి అంటే వాటిని నిరూపించాలి అంటే లోతైన పరిశోధన చేయాలి.  అన్ని కేసుల్లోనూ అలాంటి సాక్ష్యాధారాలు ఉంటాయా అంటే ఏమో చెప్పలేం.  అన్ని నిరూపితమౌతాయా అంటే కూడా ఏమి చెప్పలేము.  


అందుకే చాలా కేసులు పెండింగులో ఉంటున్నాయి.  ఏళ్లకు ఏళ్ళు పెండింగ్ పడుతూనే ఉన్నాయి.  శిక్షలు పడక, పోలీస్ స్టేషన్లోనే చాలామంది మగ్గిపోతున్నారు.  బాధితులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.  ఇదిలా ఉంటె, దిశ అత్యాచారం, హత్య కేసులో పోలీసులు మొత్తం 12 బృందాలను ఏర్పాటు చేసింది.  ఒక్కో బృందానికి ఒక్కో బాధ్యతను అప్పగించింది.  ఈ బృందాలు తమ బాధ్యతను విధిగా నిర్వర్తిచాలి.  సాక్షులను పట్టుకోవాలి.  


ఇవన్నీ జరిగి, విచారణ చేసి, పగడ్బందీగా కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి కనీసం 50 రోజుల సమయం పడుతుందట.  50 రోజుల సమయం పట్టడం అంటే మామూలు విషయం కాదు.  దిశను అపహరించి అత్యాచారం ఆమెను చంపడానికి 40 నిమిషాలు తీసుకున్నారు.  ఈ నలభై నిమిషాల కేసును విచారించి సాక్ష్యాలు తయారు చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి అన్ని రోజుల సమయం పడుతుంది అంటే అర్ధం చేసుకోవచ్చు.  అప్పటికైనా  పూర్తవుతుందో లేదో చూద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: