మొత్తం దేశాన్ని కంగారు పెట్టిన సంఘటన   షాద్‌నగర్‌ దిశ అత్యాచారం హత్య ఘటనపై సినీ  ప్రముఖులు, రాజకీయనాయకులు,  విద్యావేత్తలు అందరు సంతాపం తెలియచేసారు అలాగే దీనికి కారణమైన నలుగురిని చంపేయాలని తీవ్రంగా స్పందించారు. అలాగే  జనసేన పార్టీ అధ్యక్షుడు,  ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు అలాగే అతడు  చేసిన వ్యాఖ్యలపై నటుడు సుమన్‌ మండిపడ్డారు.

దిశ ని అత్యాచారం చేసిన ఆ నలుగురిని చంపాలని,  ఉరితీయాలని ఆగ్రహంతో వారు ఆవేశం తో నిరసన తెలియచేస్తున్నారు.అదంతా అవసరం లేదని  మహిళలపై అత్యాచారం చేసిన వారికి రెండు దెబ్బలు చాలనటం దారుణమన్నారు. అలాంటి ఘటనలు వారింట్లో జరిగితే పవన్‌ ఇలాగే అంటారా అని ప్రశ్నించారు.సుమన్‌ మాట్లాడుతూ ఇలాంటి ఘటనల్లో బాధితుల ఆవేదనను అర్థం చేసుకుని  వారికి సంతాపం తెలపాల్సిన పరిస్థితుల్లో పవన్ ఇలా  మాట్లాడడం సరికాదు అని హితవు పలికారు.

అదే విధంగా అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలు పవన్ ఏమి మాట్లాడారని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది అదేమిటంటే వైద్యురాలిపై హత్యాచారం చేసిన నలుగురిని జైల్లో పెడితే జైలు దగ్గరకు వేలమంది  మహిళలు, విద్యార్థులు యువసంఘాలు వెళ్లి ఉరితీయాలని, చంపేయాలని అంటున్నారు.  అంత స్థాయికి ఎందుకు తీసుకువెళుతున్నారు అని నిరసన తెలిపిన అందరికి సూచించారు. ఆడపిల్ల బయటకువెళ్లి ఇంటికి తిరిగిరాకపోతే వారికీ కుటుంబ సభ్యులు భయం పెట్టాలని అదే  ఆడపిల్ల మీద ఏదైనా జరిగితే చేసిన అబ్బాయిని రెండు బెత్తం దెబ్బలు వేయాలి లేదా తోలు తీయాలని సూచించారు.ఈ క్రమంలో పవన్‌ వ్యాఖ్యలపై దుమారమే చెలరేగుతుంది,   మహిళలు, మేధావులు, రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. పవన్‌ చేసిన వ్యాఖ్యలకు  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఒక స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు ఇవి కావు అని మండిపడ్డారు . ఇక దిశ ఘటనపై  ప్రతి పట్టణంలో  సమావేశాలు ఏర్పాటు చేసారు ఇందులో  వివిధ రాజకీయ పక్షాలు, లాయర్లు, డాక్టర్లు  పాల్గొన్నారు ప్రతి ఒక్కరు దిశా ఘటన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: