ఇటీవలే కాలంలో రోడ్డు యాక్సిడెంట్లు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఈ మధ్యకాలం అయితే మరి దారుణంగా జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్ లో ఫ్లై ఓవర్ పై నుండి కారు పడి మహిళా అక్కడికక్కడే మృతి చెందింది. ఇంకా ఇలాంటి దుర్ఘటనలు చాలానే జరుగుతున్నాయి. ఒకట.. రెండా ఎప్పుడు రోడ్డు ప్రమాదాలే.. ఒకప్పుడు రెండు రోజులకు ఒకటి.. మూడు రోజులకు ఒకటి జరిగేది కానీ ఇప్పుడు గంటకు ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుంది. 

                      

ఎటువైపు నుండి ఏ ప్రమాదం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి.. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్ అమరావతిలో ఆగి ఉన్న డీసీఎంను కారు వేగంగా ఢీకొట్టడంతో నలుగురు యువకులు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని అంబారుపేట వద్ద చోటుచేసుకుంది. 

                

నందిగామ విజయ టాకీస్ ప్రాంతానికి చెందిన అనీల్, సాయి, మనోజ్, దుర్గా, అరవింద్ కారులో విజయవాడకు బయలుదేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న కారు అంబారుపేటకు చేరుకోగానే అతివేగంతో ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టింది. దీంతో ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతిచెందగా, 

                

తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు మార్గం మధ్యలోనే మరణించారు. మృతులను దుర్గా, మనోజ్, అరవింద్, అనీల్‌గా గుర్తించారు. అతివేగంగా, సెల్‌ఫోన్ మాట్లాడుతూ కారు నడుపడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. అయితే ప్రమాదంలో మృతి చెందిన వారి శరీరాలు గుర్తు పట్టలేని విధంగా శరీరాలు పీస్ పీస్ అయ్యాయి అని పోలీసులు చెప్తున్నారు. దీంతో కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: