దిశ హత్య కేసులో పోలిసులు నిందితులను 10 రోజుల కస్టడీకి కోరగా కోర్టు 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమంతించిన సంగతి తెలిసిందే. దిశ హత్య కేసు దర్యాప్తుకు 50 మంది పోలీసులను వినియోగిస్తున్నట్లు సమాచారం, నలుగురు ఏఎస్పీ స్థాయి అధికారులు 7 బృందాలుగా ఏర్పడి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

 

నిన్న తెల్లవారుజాము నుంచే నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. దిశ హత్య కేసుపై పోలీసులు నిందితులపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే మొదట నిందితులు సమాధానం చెప్పడానికి తటపటాయించారు, ఈ నేపథ్యంలో పోలీసులు తమదైన స్టయిలులో సమాధానం చెప్పించారు అని అత్యంత విశ్వసనీయ వర్గాలు మీడియాకి వెల్లడించాయి. మొదట ప్రధాన నిందితుడు అరీఫుకు పోలీసులు థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

 

అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఘటన స్థలికి నిందితులను తీసుకు వెళ్లి సీన్ రీ కంస్ట్రక్ట్ చేయించారు. ఇక ఆ తరువాత పోలీసులు నిందితులను అత్యంత రహస్య ప్రాంతంలో విచారించారు. విచారణలో భాగంగా నిజాలు వెలికి తీసేందుకుగాను ఒక్కొక్కరిని పిలిచి ఘటన జరిగిన తీరు గురించి అడిగారు మంచిగా అడిగితే నిందితులు సమాధానం చెప్తారా?, సమాధానం సరిగ్గా చెప్పకపోవడంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. ప్రధాన నిందితుడు ఆరీఫ్ కు థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 20 నిమిషాల పాటు పోలీసులు ఆరీఫ్ కు చుక్కలు చూపించారని సమాచారం. పోలీసుల ట్రీట్మెంట్ కు బెదిరిపోయిన ఆరీఫ్ నిజాలు కక్కేసినట్లు తెలుస్తోంది. ఆరీఫ్ సమాధానంతో కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు.

 

మిగిలిన ముగ్గురు నిందితులను కూడా తమదైన స్టైల్ లో విచారించిన పోలీసులు తమకు కావలసిన సమాచారాన్ని నిందితుల నుంచి రాబట్టారు. తమ కస్టడీలో నిందితులు ఇంకా ఆరు రోజుల పాటు ఉండనున్నారు దీనితొ పోలీసులు వీలైనంత తొందరగా పూర్తి ఆధారాలు సేకరించి సాధ్యమైనంత తొందరగా నిందితులపై చార్జిషీట్ వెయ్యాలని చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చొరవతో హైకోర్టు ఇప్పటికే దిశ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు అతి తొందరగా చార్జిషీట్ వేసి నిందితులకు తొందరగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: