ఒకప్పుడు.. ప్రపంచంలోని మహిళలందరూ భారత్ కు వచ్చెనందుకు ఇష్టపడుతుండేవారు.. ఎందుకంటే ఎక్కడ ఏ దేశంలో మహిళకు దక్కని గౌరవం భారత దక్కుతుంది అని.. కారణం భారతీయులు ఆరాధించేది... భూమాత, వేదమాత, గోమాత, ధన మాత, ధాన్యమత, గంగామాత" అని... ఇలా భారతీయులు ప్రతి మంచి విషయాలలో కూడా మహిళలకే ప్రథమస్థానం ఇస్తారు.. అందుకే ప్రపంచంలోనే అతి అద్భుతమైన ప్రదేశంగా మన భారత్ ను మహిళలు ప్రేమిస్తారు. 

 

అలాంటి ఈ దేశానికి రావాలంటే ఇప్పుడు భయపడుతున్నారు.. ఎక్కడ ఏ కామాంధుడు మనల్ని ఏం చేస్తాడో అని మాములుగా పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, సిరియా వంటి దేశాలకు వెళ్లాలంటే ఎక్కడ నుండి ఎలాంటి కాల్పులు జరుగుతాయో తెలియదు. ఎటునుంచి దాడులు చేస్తారో తెలియదు అని. 

 

అందుకే ఆయా దేశంలో పర్యటించే టూరిస్టులకు ఆయా దేశాలు మార్గదర్శకాలును సూచిస్తుంటాయి. ఉత్తర కొరియాలో పర్యటించే టూరిస్టులకు అక్కడి నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటే సేఫ్ గా తిరిగివస్తారని చెప్తారు. అయితే, ఇప్పుడు భారత్ పర్యటించే టూరిస్టులకు ముఖ్యంగా మహిళా టూరిస్టులకు అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు కొన్ని సంచలన సూచనలు చేస్తున్నాయి. 

 

మహిళలు ఇండియాలో పర్యటించే సమయంలో ఒంటరిగా బయటకు వెళ్ళొద్దని, బయటకు వెళ్లే సమయంలో కొన్ని సూచనలు పాటించాలని బ్రిటిష్ ట్రావెల్ అడ్వైజరీ చెప్పారు. భారత్ లో పర్యటించే సమయంలో తప్పనిసరిగా మహిళలు తమ సెల్ ఫోన్ లో 100 నెంబర్ ఉంచుకోవాలని పేర్కొంది. 

 

ఇండియా లో పర్యటించే సమయంలో అక్కడి సాంప్రదాయ దుస్తులను ధరించాలని పేర్కొన్నారు. బీచ్ లలో ఒంటరిగా తిరగొద్దని పేర్కొంటున్నది. అలానే ఆపద వస్తే వెంటనే 1091, 1096 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని లేదంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాలని పేర్కొంది.

 

వాస్తవానికి భారత్ కు వచ్చే చాలామంది మహిళలు మన సాంప్రదాయ దుస్తులు ధరించడానికి ఇష్టపడుతారు. కారణం మన దుస్తులలో అంత అందం ఉంటుంది. అయితే ఇప్పడు టూరిస్టులకు స్వయంగా వారి దేశం వారే అక్కడ సాంప్రదాయ దుస్తులు ధరించండి అని మార్గదర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనా నిర్భయ ఘటన, దిశా ఘటనతో మన దేశంలో మహిళలు ఒంటరిగా తిరగాలంటే భయపడేలా చేశారు కామాంధులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: