దిశ నిందుతులు నలుగురిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. దిశ హత్యాచారం జరిగిన విధానాన్ని సీన్ రికన్స్ట్రక్షన్ జరిగుతున్నపుడు నలుగురు నిందితులు పారిపోయేందుకు ప్రయత్నం చేసినట్లు సమాచారం. హత్యాచారం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు తమ  కస్టడీలో ఉన్న నిందితులను పోలీసులు శంషాబాద్ చటాన్ పల్లి ప్రాంతానికి అర్ధరాత్రి తీసుకెళ్ళారు.

 

సీన్ జరిగిన ప్రాంతానికి తీసుకెళ్ళనపుడు నిందితులు నలుగురు జరిగిన ఘటన మొత్తాన్ని వివరిస్తున్నారు. అదే సమయంలో పోలీసుల నుండి తుపాకులు లాక్కుని పారిపోయేందుకు తర్వాత తిరగబడేందుకు ప్రయత్నించారట. దాంతో వాళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నించినా సాధ్యం కాకపోవటంతో చివరకు పోలీసులు వేరే దారిలేక వాళ్ళందరినీ ఎన్ కౌంటర్ చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

 

మొత్తానికి దిశపై హత్యాచారం జరిగిన వారం తర్వాత జరిగిన ఈ ఎన్ కౌంటర్ సంచలనంగా మారింది. దిశ పై హత్యాచారం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం కలిగించిందో ఇపుడు వారి ఎన్ కౌంటర్ కూడా అంతే సంచలనంగా మారింది. హత్యాచారం ఘటన బయటపడిన దగ్గర నుండి నిందితులు నలుగురిని ఉరి తీయాలని, రాళ్ళతో కొట్టి చంపాలనే డిమాండ్లు దేశమంతటా ఏ స్ధాయిలో డిమాండ్లు పెరిగిపోతున్నాయో అందరికీ తెలిసిందే.

 

నిందితులను పట్టుకున్న తర్వాత వాళ్ళని తమకు అప్పగించమంటూ యువత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. దాదాపు ఐదు రోజుల క్రితం వారిని విచారణ కోసమని ఉంచిన శంషాబాద్ పోలీసు స్టేషన్ లోకి యువత చొచ్చుకుని వెళ్ళేందుకు పెద్ద ప్రయత్నమే జరిగింది. పోలీసు స్టేషన్లోకి వెళ్ళి వాళ్ళని చంపేందుకు జనాలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే అది సాధ్యం కాకపోవటంతో పోలీసులపై జనాలు తిరగబడ్డారు.

 

తర్వాత వారిని భారీ బందోబస్తుతో చర్లపల్లి జైలుకు తరలించినా వారి విచారణ  పోలీసుల్లో ఎప్పటికపుడు సవాలుగానే మారింది. వారికి ఎటువంటి హాని జరగకుండా భద్రత కలిగించటం కూడా పోలీసులకు సవాలుగానే మారింది. ఈ పరిస్ధితుల్లో సిట్ బృందం ఆధ్వర్యంలో రీకన్ స్ట్రక్షన్ చేయటానికి వాళ్ళని ఘటన జరిగిన ప్రాంతానికి తీసుకెళ్ళినపుడు జరిగిన సీన్ తో చివరకు వారిని ఎన్ కౌంటర్ చేసేశారు పోలీసులు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: