దిశ హత్యాచార ఘటన ప్రతి హృదయాన్ని కలచి వేస్తుంది. సమాజంలో ఆడపిల్లలకు భద్రత లేదని నిరూపించింది. ఇకపోతే దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో అనేక నాటకీయ పరిణామాలు బుధవారం సాయంత్రం నుంచి చోటుచేసు కుంటున్నాయట. ఇప్పటికే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించా రంటు విమర్శలు రావడంతో ఈ కేసును పోలీసులు సవాలుగా తీసుకున్నారని తెలుస్తుంది.

 

 

ఇదే కాకుండా నిందితులను షాద్‌నగర్‌ కోర్టు కస్టడీకి ఇచ్చిన విషయాన్ని లీక్‌ కాకుండా జాగ్రత్తపడ్డారు. ఈ విషయంలో షాద్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్, డీజీపీ కార్యాలయాలు అత్యంత గోప్యత పాటిస్తున్నాయి. ఇప్పటికే మీడియాలో వస్తున్న కథనాలు, ప్రచారంపై పోలీసులు ఎలాంటి వ్యాఖ్యలు చేయట్లేదు. తమకు కోర్టు నుంచి నలుగురు నిందితుల కస్టడీపై  ఎలాంటి ఆదేశాలు రాలేదనే చెబుతున్నారు.  

 

 

ఇకపోతే అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం రహస్యంగా బుధవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో నిందితులు మహ్మద్‌ ఆరిఫ్, జొల్లు నవీన్, శివ, చెన్నకేశవులును చర్లపల్లి జైలు నుంచి పోలీసులు తరలించి, తొలుత తొండుపల్లి టోల్‌గేట్‌ ప్రాంతంలో ఘటనాస్థలానికి  తీసుకెళ్లారని తెలిసింది. అక్కడ లారీ నిలిపిన స్థలం, మద్యం తాగిన ప్రాంతాలను పరిశీలించారట.

 

 

దిశను ముందు చూసిందెవరు? అత్యాచారం ఆలోచన ముందు ఎవరికి వచ్చింది?.. అనే తదితర వివరాలు సంపూర్ణంగా తెలుసుకున్నారట.. ఇదే కాకుండా స్కూటీ ని పంక్చర్‌ చేసిందెవరు? ఏ షాప్‌కు వెళ్లి ఈ పని చేయించారు. అనే దిశగా వివరాలు సేకరించారట. ఇక దిశను ఎత్తుకెళ్లిన ప్రాంతాన్ని నిందితులు పోలీసులకు చూపించగా అత్యా చారం జరిగిన ప్రాంతానికి సమీపంలో పాతి పెట్టిన దిశ మొబైల్‌ను నిందితుల తోనే తవ్వి తీయించారు. ఇదే కాకుండా చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద మృతదేహాన్ని దహనం చేసేవరకు జరిగిన ఉదంతాన్ని నిందితులు పోలీసులకు కళ్లకు కట్టినట్లుగా చెప్పారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: