శంషాబాద్ పరిసరాల్లో దారుణ హత్యాచారానికి గురైన దిశ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత వారం ఈరోజుకి జరిగిన దిశా ఘటనపై టీనేజ్ పిల్లల నుండి పండు ముసలి వరుకు ప్రతి ఒక్కరు కంట కన్నీరు పెట్టుకుంటున్నారు. సినీ నటుల నుండి రాజీకియ నాయకుల వరుకు ప్రతి ఒక్కరు ఈ ఘటనపై వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

                        

అయితే ఈ కేసుకు సంబంధించి నిందితుల నుండి రోజుకో నిజం బయటపడుతుంది. ఆ నలుగురు కామాంధులును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మొదటి రోజు (నిన్న) గురువారం విచారించారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మొదటి రోజే సిట్ కీలక ఆధారాలు సేకరించింది. నిందితులు ఉపయోగించిన లారీలో క్లూస్ టీమ్ తనిఖీలు చేసింది. 

                                      

అయితే ఇలా విచారణ జరుగుతున్న సమయంలోనే ఆ నాలుగు పారిపోవడానికి ప్రయత్నించగా నలుగురు నినిందితులను ఎన్కౌంటర్ చేసేశారు పోలీసులు. ఘటన జరిగిన వారం రోజులలోపే దిశా ఘటన నిందితులను ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. అయితే పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. 

                                   

గత నెల 27న హత్యాచారం చేసి ఆ తర్వాత కాల్చి చంపారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలని, లేదా బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్‌కౌంటర్‌ నిందితులు పారిపోవడానికి ప్రయత్నించినా సమయంలో జరిగినట్టు పోలీసులు చెప్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: