దిశ హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. దిశ హత్య కేసు నిందితులను ఈ తెల్లవారుజామున 3.30 గంటలకు ఎన్ కౌంటర్ సమాచారం అందుతోంది. క్రైమ్ సీన్ రీ కంస్ట్రక్షన్ చేస్తున్న సమయంలో పోలీసులపై ఎదురు కాల్పులు జరపడంతో ఆత్మ రక్షణ కోసం పోలీసులు నిందితులని ఎన్ కౌంటర్ చేసినట్లు సమాచారం. మృతదేహాలను ఉస్మానియా హాస్పిటల్ కి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు వద్దు నిందితులను వెంటనే ఉరి తీయాలని ప్రజలు డిమాండ్ చేసిన వేళ నిందితులను ఎన్ కౌంటర్ చేసి పోలీసులు సంచలనం సృష్టించారు. గతంలోనూ సీపీ సజ్జనార్ వరంగల్ లో జరిగిన యాసిడ్ దాడి ఘటనలో నిందితులను ఎన్ కౌంటర్ చేశారు.

 

నవంబర్ 27 న దిశ స్కూటీ ని పంక్చర్ చేసి నలుగురు నిందితులు ఆమె స్కూటీ కి పంక్చర్ వేయిస్తామని చెప్పి చెన్నకేశవులు అనే వ్యక్తికి స్కూటీ ఇచ్చి పంపారు ప్లాన్ ప్రకారం ఆ వ్యక్తి దగ్గరలోని షాప్ కి వెళ్లి కేవలం టైర్ లో గాలి నింపుకుని వచ్చి షాప్ క్లోజ్ చేసి ఉందని దిశకు చెప్పగా, అక్కడి నుండి వెళ్తా అన్న దిశను కిడ్నప్ చేసి సర్వీస్ రోడ్డు వెనుక ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లి అతి దారుణంగా నిందితులు ఆమె పై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. గ్యాంగ్ రేప్ అనంతరం ఊపిరి ఆడకుండా చేసి దిశ ని హత్య చేసి శవాన్ని ఇద్దరు వ్యక్తులు 28 కిమీ దూరం వరకు తీసుకు వెళ్లి తగులబెట్టారు. స్కూటీ నెంబర్ ప్లేట్ ను కొత్తూరు దగ్గర పడవేసి ఎవ్వరికీ అనుమానం రాకుండా అక్కడి నుంచి పరారయ్యారు.

 

దిశ పోస్టుమార్టం నివేదిక హత్య జరిగిన తీరును కళ్ళకు కట్టినట్లు చూపింది. నిందితులు దిశ పై గ్యాంగ్ రేప్ చేసి తరువాత ఊపిరి ఆడకుండా చేసి సజీవ దహనం చేసినట్లు పోస్టుమార్టం రిపోర్ట్ లో ఉంది. నిందితులు పక్కా ప్రణాళిక తో దిశ స్కూటీ ని పంక్చర్ చేసి డ్రామా ఆడినట్లు పోలీసులు నిర్ధారించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: