వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ ప్రియాంక‌రెడ్డి అలియాస్ దిశ హంత‌కులు ఎన్‌కౌంట‌ర్‌కు గుర‌య్యారు. దిశ సంఘ‌ట‌న తీరుతెన్నుల‌ను తెలుసుకునేందుకు స్పెష‌ల్ పోలీసులు సీన్ రీ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ చేస్తున్న క్ర‌మంలో నిందితులు అదును చూసి పారిపోయే ప్ర‌య‌త్నంలో ఉండ‌గా పోలీసులు వారిపై కాల్పులు జ‌రిపారు. దీంతో ఆ న‌లుగురు హంత‌కులు హ‌త‌మ‌య్యారు. దిశ ను అత్యాచారం జ‌రిపి, ఆపై హ‌త్య చేసి, ద‌హనం చేశారు. అయితే ఈ సీన్ జ‌రిగిన తీరును సేక‌రించే ప‌నిలో పోలీసులు ఉండ మ‌హ్మ‌ద్, బొల్లు న‌వీన్‌, బొల్లు శివ‌, చెన్న కేశ‌వులు న‌లుగురు ఒకేసారి పోలీసుల‌పై తిరుగ‌బ‌డి పోలీసుల వ‌ద్ద ఉన్న తుపాకుల‌ను లాక్కుని కాల్పులు జ‌రిపుతూ పారిపోయే క్ర‌మంలో పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేశార‌ని స‌మాచారం.

 

గ‌త‌వారం రోజులుగా దేశ‌వ్యాప్తంగా దిశ సంఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే.  దిశ‌ను హత్య, అత్యాచారం కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించిన సంగతి తెలిసిందనే.  లారీ డ్రైవర్లు, క్లినర్లు ఈ అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే.  ఈ కేసులో సిసి టీవీలు ఆధారంగా చేసుకొని ఛేదించారు.  నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అనేక దారుణమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి.  నిందితులు 9:30 గంటల ప్రాంతంలో ప్రియాంక రెడ్డిని అపహరించి నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లారు.  ఆ తరువాత ఆమె నోరు మూసి అత్యచారం చేశారు.  

 

ఆమె హెల్ప్ హెల్ప్ అని అరుస్తుండటంతో ఆమెను బలవంతంగా మద్యం తాగించారు. దీంతో ప్రియాంక రెడ్డి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది.  ముక్కు, నోరు గట్టిగా మూయడంతో ఆమె మరణించింది.  అక్కడి నుంచి ప్రియాంక రెడ్డి మృతదేహాన్ని క్యాబిన్ లో వేసుకొని పలుమార్లు మృతదేహంపై అత్యచారం చేశారట. ఆ తరువాత ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టారు.  పోలీసుల విచారణలో తెలిసిన ఈ నిజాలు వింటుంటేనే భయానకంగా ఉన్నాయి. ప్రియాంక రెడ్డి ఈ బాధను ఎలా భరించిందో తలచుకుంటేనే భయం వేస్తోంది.  

 

అయితే ఈసంఘ‌ట‌న తో దేశం మొత్తం అట్టుడికి పోయింది. ప్ర‌జ‌లు వీరిని చంపాల‌ని, ఎన్‌కౌంట‌ర్ చేయాల‌ని దేశ‌వ్యాప్తంగా డిమాండ్ చేశారు. అయితే పోలీసులు చ‌ట్ట ప్ర‌కారం శిక్షిస్తామ‌ని చెప్పారు. కోర్టులో నిందితుల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. కోర్టు వీరిని విచార‌ణ నిమిత్తం చ‌ర్ల‌పల్లి జైల్‌కు త‌రలించారు. తిరిగి పోలీసులు వీరిని పోలీసు క‌ష్ట‌డికి ఇవ్వాల‌ని కోర్టుకు పిటిష‌న్ వేయ‌గా కోర్టు అందుకు అంగీక‌రించింది. అయితే కేసును ఛేదించే క్ర‌మంలో నిందితులు తిర‌గ‌బ‌డ‌టం, పారిపోతున్న క్ర‌మంలో ఎన్‌కౌంట‌ర్ చేశారు. దీంతో ప్ర‌జ‌లు కోరుకుంటున్న న్యాయం జ‌రిగిన‌ట్లైంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: