పశు వైద్యురాలు దిశను హత్య అత్యాచారం చేసిన నిందితులను ఈరోజు ఉదయం 3 గంటలకు పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపేశారు. అయితే కస్టడీలోకి తీసుకొని రీ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు. ఉదయం 3 గంటల సమయంలో చీకటి గా ఉండటంతో ఆ ప్రాంతం పూర్తిగా తెలిసిన ఆ నీచులు తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో రాళ్లు కూడా రువ్వారు. అయితే దిశను కాల్చి హతమార్చిన షాద్ నగర్ చటన్ పల్లి బ్రిడ్జి దగ్గరే ఆ నలుగురిని పోలీసులు ఎన్కౌంటర్ చేసి హతమార్చినట్లు తెలుస్తుంది. పారిపోవడానికి ప్రయత్నించడం కాకా పోలీసులకే రాళ్లు రువ్వి గాయపరిచే యత్నం చేసారు. ఇక చేసేదేమి లేక నిందితులు మహమ్మద్ ఆరిఫ్  పాషా, జొల్లు శివ, చెన్నకేశవులు, జొల్లు నవీన్ లను... ఉన్నతాధికారులకు తెల్లవారుజామున ఎన్కౌంటర్ చేసిన పోలీసులు.


అయితే ఇంతవరకు పోలీసులు అధికారికంగా ఎన్కౌంటర్ చేసినట్టు ప్రకటించలేదు. పోలీసుల వద్ద ఆయుధాలను తీసుకొని పరిగెత్తుతున్న నలుగురిని పోలీసుల తప్పనిసరి అయ్యి.. ఎన్కౌంటర్ చేశారనిి      విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సీపీ సజ్జనార్ ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి వెళ్లి... ఎన్కౌంటర్ ఎలా జరిగింది అనే వివరాలు తెలుసుకున్నాడు. అయితే ఒక సోదరి లాంటి దిశ వారిని ఎంత బ్రతిమాలిన వదలకుండా అతి కిరాతంగా చంపిన ఈ నీచులు తప్పించుకుంటే... ఇంకా ఎంత మంది అబలల జీవితాలను నాశనం చేస్తారనే ఉద్దేశంతో పోలీసులు చంపేశారు. ఆ దుర్మగులు చనిపోయిన తీపికబురు ఈరోజు నిద్రలేవగానే తెలిసిన దిశ తల్లిదండ్రులు తమకు న్యాయం జరిగిందని హర్షం వక్తం చేస్తున్నారు. 'మా పాపకు న్యాయం జరిగింది ' అని దిశ తల్లిదండ్రులు చెప్పారు. డిసెంబర్ 4న నిందితులను...పోలీసులు కస్టడీ లోని తీసుకున్నారు. యావత్ భారత్ దేశం ఈరోజు దీపావళి పండుగ చేసుకుంటున్నారు. అందరూ నేతలు కూడా ఎన్కౌంటర్ చేయడమనేది సూపర్ కరెక్టు అని పోలీసులను బాగా కొనియాడుతున్నారు. ఈ ఎన్కౌంటర్ బయట ఉన్న కామాంధులందరికి గట్టి మెసేజ్ అని అందరూ అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: