ప్రపంచంలో ఒక కొత్త చరిత్ర మొదలైన ప్రతిసారి అది సంచలనంగా ప్రజల గుండెల్లో నిలిచి పోతుంది. ఇన్నాళ్లూ పోలీసు వ్యవస్దను తప్పుపట్టిన ప్రతివారికి ఇప్పుడు వారి సత్తా ఏంటో తెలిసింది. ఒక ఆడపిల్లను అత్యంత దారుణంగా తాను కూడా ఓ మనిషే అని మరిచి కౄరంగా హత్యాచారం చేసిన నిందితులను బర్రెల్లా మేపి వారి మదం అనిచిన ఘటన యావత్ ప్రజానీకం హర్షించదగ్గదే ఇకపోతే మన యింట్లోకి విషపు పురుగు ఏదైన వస్తే దాన్ని వెంటనే చంపేస్తాం అలాంటింది మన మనసులోకి ఇలాంటి విషపు ఆలోచనలు వస్తే వాటిని కూడా వెంటనే అణిచి వేయాలి లేదంటే సమాజం తన ఆగ్రహంతో దహించి వేస్తుందని దిశ ఘటన తెలుస్తుంది.

 

 

ఒక మనిషిగా భూమి మీద పుట్టి చివరకు సాధించింది ఏంటని అడిగితే గర్వంగా చెప్పుకోవాలే గాని ఇలా నీచమైన కుక్క చావు చచ్చి అటు కన్నవారికి సమాజానికి మాయని మచ్చలా మిగలకూడదు. చిన్నప్పటినుండి అల్లారు ముద్దుగా పిల్లలను పెంచేది ఇలాంటి నికృష్టపు పనులు చేయడానికి కాదు. ఇకపోతే దిశ కేసు విషయంలో ఆ నిందితుల తల్లుల గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి. పరాయి పిల్ల ఐనా తమ బిడ్దలా భావించి ఈ రేపిస్టుల్ని చంపేయండని ముందుగానే వారి మాతృత్వాన్ని చంపుని చెప్పారు.

 

 

ఈ ఘటన పిల్లలను కన్న ప్రతి తల్లి దండ్రులకు హెచ్చరిక కావాలి. భావితరాల వారికి గుణపాఠం కావాలి. ప్రతి తల్లి దండ్రులు ఇలా ఆలోచించడం మొదలు పెడితే పిల్లల్లో కూడా భయం వస్తుంది. పిల్లలకు ఆస్తిపాస్తులు కాదు ఇవ్వవలసింది సంస్కారం నేర్పించండి. సమాజంలో మనిషిలా బ్రకడం నేర్పించండి. నీతిగా నిజాయితిగా నలుగురిని గౌరవించడం నేర్పించండి. ఇకపోతే దిశ ఘటనలో నిందితుల్ని ఎన్‌కౌంటర్ చేయడం పట్ల ఒక్కరు కూడా ఆ మృగాలపట్ల జాలి చూపడం లేదు. ఆ తోడేళ్లకు తగిన బుద్దే చెప్పారంటూ ప్రజలు కన్నీటితో దిశకు నివాళ్లు అర్పిస్తున్నారు. ఈ ఘటన సమాజంలో ఉన్న మృగాలకు గుణపాఠం కావాలి అని అనుకుంటున్నారు..   

మరింత సమాచారం తెలుసుకోండి: