దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితులు దిశ ఘటన జరిగిన స్థలంలోనే ఎన్ కౌంటర్ కు గురయ్యారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు కోసం సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలోనే నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోయారు. పోలీసులు పారిపోతున్న నిందితులపై కాల్పులు జరిపారు. పోలీసులు కాల్పులు జరపడంతో నిందితులు అక్కడికక్కడే మరణించారు. 
 
కరుడుకట్టిన కామాంధులైన అరిఫ్, శివ, చెన్నకేశవులు, నవీన్ లను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. కొంతమంది మహిళా నేతలు నిందితుల ఎన్ కౌంటర్ తో దిశకు ఆత్మశాంతి లభించిందని చెబుతున్నారు. ఈరోజు తెల్లవారుజామున నిందితులు పోలీసుల చేతిలో ఎన్ కౌంటర్ కు గురయ్యారు. దిశ ఘటనలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు నిందితులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పోలీసులు నిందితులను ఎన్ కౌంటర్ చేయటం గమనార్హం. 
 
 2008 సంవత్సరం డిసెంబర్ నెలలో బీటెక్ చదువుతున్న స్వప్నికపై శ్రీనివాస్ అనే యువకుడు యాసిడ్ తో దాడి చేశాడు. స్వప్నిక యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రస్తుతం సైబరాబాద్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న సీపీ సజ్జనార్ ఆ సమయంలో వరంగల్ ఎస్పీగా ఉన్నారు. దాడిలో అరెస్ట్ అయిన ముగ్గులు నిందితులను పోలీసులు  ఎన్ కౌంటర్ చేశారు. 


ఎస్పీ సజ్జనార్ ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్లు వివరణ ఇచ్చారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నారు. ఇప్పుడు దిశ ఘటనలో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. కేసీఆర్ ప్రభుత్వం కూడా దిశ ఘటనలో రాజశేఖర్ రెడ్డిని ఫాలో అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు ఈ ఘటన గురించి ఇంకా స్పందించాల్సి ఉంది. దిశ ఘటనలో నిందితుల ఎన్ కౌంటర్ పట్ల ప్రజల నుండి హర్షం వ్యక్తమవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: