దిశ హత్య కేసు నిందితులను ఈ తెల్లవారుజామున 3.30 గంటలకు పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. క్రైమ్ సీన్ రీ కంస్ట్రక్షన్ చేస్తున్న సమయంలో పోలీసులపై ఎదురు కాల్పులు జరపడంతో ఆత్మ రక్షణ కోసం పోలీసులు నిందితులని ఎన్ కౌంటర్ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు దిశ హత్య కేసు నిందితులను ఎన్ కౌంటర్ చేసిన నేపథ్యంలో దిశ కుటుంబ సభ్యులు స్పందించారు. "మా పాపను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుల పాపం పండింది, దిశకు న్యాయం జరిగింది" అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

 

గత నెల 27 న దిశను అత్యంత పాశవికంగా హత్య చేశారు నిందితులు. ప్రధాన నిందితుడు ఆరీఫ్ తో సహా నలుగురు నిందితులను పోలీసులు నవంబర్ 28న అరెస్ట్ చేశారు. అదే రోజు చర్లపల్లి జైలుకు తరలించారు. ఇక ఈ నెల 4న వారం రోజులు నిందితులను పోలీస్ కస్టడీకి ఇస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. నవంబర్ 27న పక్కా ప్రణాళికతో దిశ స్కూటీ ని పంక్చర్ చేసి నలుగురు నిందితులు దిశను కిడ్నాప్ చేసి సర్వీస్ రోడ్డు వెనుక ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లి అతి దారుణంగా నిందితులు ఆమె పై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. గ్యాంగ్ రేప్ అనంతరం దిశని లారీలోకి ఎక్కించి మరోసారి దారుణానికి ఒడికట్టారు నిందితులు. దిశను బ్రతికి వుండగానే సజీవ దహనం చేసి అత్యంత దారుణంగా  హత్య చేసారు. స్కూటీ నెంబర్ ప్లేట్ ను కొత్తూరు దగ్గర పడవేసి ఎవ్వరికీ అనుమానం రాకుండా అక్కడి నుంచి పరారయ్యారు.

 

దిశ మీద ఎక్కడ అయితే అఘాయిత్యానికి పాల్పడ్డారో అక్కడే నిందితులు పాపం పండింది. నిందితులను చటాన్పల్లి బ్రిడ్జి వద్దే ఎన్ కౌంటర్ చేశారు. గతంలో వరంగల్ లో ఇద్దరు యువతులపై దారుణంగా యాసిడ్ ఘటనకు ఇద్దరు నిందితులు పాల్పడగా అందులో ఒక యువతి ప్రాణాలు కోల్పోగా మరో యువతి తీవ్రంగా గాయపడింది. ఆ ఇద్దరు నిందితులని అప్పటి వరంగల్ ఎస్పీ సజ్జనార్ ఎన్ కౌంటర్ చేశారు.ఇప్పుడు కూడా దిశ హత్య కేసుకు  ఆయనే నేతృత్వం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: